ఇగో మల్ల సెప్తుండా, 5 తేదీ లోపు డ్యూటీలో చేరాలే. అంతే, ఇదే లాస్ట్ : కెసిఆర్

ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రసక్తే లేదు : సీఎం కేసీఆర్
‘ఆర్టీసీ కార్మికులు నా బిడ్డల్లాంటి వాళ్లు. యూనియన్ల మాయలో కార్మికులు పడొద్దు. ఆర్టీసీ కార్మికులకు మరో ఛాన్స్‌ ఇస్తున్నా.  ఈ నెల 5 అర్థరాత్రిలోపు బేషరతుగా డ్యూటీలో చేరాలే.. అదొ అప్పుడు   వారికి భవిష్యత్‌ ఉంటుంది. అవకాశం సద్వినియోగం చేసుకోకుంటే ప్రభుత్వం చేయగలిగిందని ఏమీ లేదు..నేను ఎవరినీ బుల్డోజ్‌ చేయడం లేదు,’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెగేసి చెప్పినరు.
ఆర్టీసీ కార్మికులు అర్థం లేని డిమాండ్లతో సమ్మె చేస్తున్నారన్నారు. చట్ట వ్యతిరేకంగా సమ్మె చేస్తే యాజమాన్యానికి, ఉద్యోగులకు సంబంధాలు కట్‌ అవుతాయి, అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మళ్లీ హెచ్చరించారు. ఆర్టీసి సమ్మె మూడు వారాలు దాటినాలుగోవారంలో పడింది.విజయవంతంగా నెలరోజులు పూర్తిచేసుకోబోతున్నది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి, ఆపైన ప్రెస్ పెట్టి ఇలా చెప్పారు.
ఇప్పటికే 2100  ప్రైవేట్ బస్సులు ప్రస్తుతం నడుస్తున్నాయి.
సమ్మెకు వెళ్లవద్దని చెప్పినా కార్మికులు విన్లే.ఇల్లీగల్ సమ్మె అని లేబర్ డిపార్ట్మెంటోళ్లు చెప్పినా కార్మికులు విన్లే.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు సీఎం కేసీఆర్‌. దాదాపు ఐదు గంటలకు పైగా తెలంగాణ కెబినెట్‌ సమావేశం జరిగింది.
ఆర్టీసీ సమస్యపై సుధీరంగా చర్చించామని, ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రసక్తే లేదన్నారు.
ఇక 5100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించంది అన్నారు . కేబినెట్‌ నిర్ణయంలో మార్పుండదు.. పర్మిట్లలోనూ మార్పులుండదని తెగేసి చెప్పినారు సీఎెం కేసీఆర్‌.
’ఇప్పటికే ఉద్యోగులతో సంబంధాలు కట్‌ అయ్యాయి. సంస్థ ఏ నిర్ణయమైనా తీసుకుని ముందుకెళ్లొచ్చు. కార్మికులందరి నోట్లో మట్టి పడే పరిస్థితి వచ్చిందని, అని ఆయన చాాలా నిక్కచ్చిగా చెప్పినారు.
అయితే… కార్మికుల పొట్ట కొట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మాత్రం చెప్పినరు.
‘67 శాతం జీతాలు పెంచిన చరిత్ర ఎక్కడుంది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను సైతం రెగ్యులరైజ్‌ చేసినం.  ఆర్టీసీ కార్మికులు నా బిడ్డల్లాంటి వాళ్లు. యూనియన్ల మాయలో కార్మికులు పడొద్దు. ఆర్టీసీ కార్మికులకు మరో ఛాన్స్‌ ఇస్తున్నా,’  అన్నారు.