ఐటి సెక్టర్ కు గడ్డు రోజులు, వచ్చే ఏడాది 40 వేల ఉద్యోగాల కట్?

ఆర్ఠిక మాంద్యం కారణంగా ఐటికంపెనీలు పెద్ద ఎత్తున నిర్వహణా భారం తగ్గంచుకునేందుకు చూస్తున్నాయని ఫలితంగా వచ్చే ఏడాది దాాదాపు 40 వేల   ఉద్యోగాల దాకా పోవచ్చని   ఐటి నిపుణులు చెబుతున్నారు.
మిడిల్ లెవెల్ ఈ ఉద్యోగాల కోత ఉండవచ్చని కూడా చెబుతున్నారు.  మిడిల్ లెవెల్ అంటే 10 నుంచి 20 సంవత్సరాల అనుభవం ఉన్నారు.  ఐటి సెక్టర్  కింది స్థాయిలోఎక్కువ మంది ఉంటారు. వీళ్లు వల్ల ఆర్థిక భారం పెద్దగా ఉండదు. ఇక టాప్ లో ఉన్న ఎగ్జిక్యూటివ్ లు చాలా తక్కువ మంది ఉంటారు.  ఇక మిగిలింది జీతాలు ఎక్కువగా ఉండి, సంఖ్యరీత్యా కూడా ఎక్కువగా ఉండే మధ్య స్థ ఉద్యోగులే. అందువల్ల ఈ ఉద్యోగాల మీద కంపెనీలు కోత పెట్టవచ్చని ఎకనమిక్ టైమ్స్ రాసింది.
మొత్తం ఐటి ఉద్యోగాలలో ఐదో వంతు  మిడిల్ లెవెల్  ఉద్యోగులుంటారు, వీళ్లు  దాదాపు ఆరు లక్షల మంది ఉంటారు. అంటే వచ్చే పన్నెండు నెలల్లో దాదాపు 7 శాతం  ఉద్యోగాలు పొవచ్చని ఈ ప్రతిక  పేర్కొంది.
ఉద్యోగాలను తొలిగించాలని ఎకంపెనీ భావించదు.అయితే, రాబడి లేకపోవడం ఆందోళన కలిగిస్తూ ఉంది. అందువల్ల ఉద్యోగాలమీద కోత పెట్టడం మినహా మరొక గత్యంతరం లేదని  టీమ్ లీజ్ సహసంస్థాపకురాలురితుపర్ణ చక్రబర్తి చెప్పారు.