ఆంధ్రప్రదేశ్ దారిలో హర్యానా, ఇండస్ట్రీలో 75% ఉద్యోగాలు లోకల్స్ కే

స్థానికులకు ఉద్యోగాల విషయంలో చాలా రాష్ట్రాలు ఇపుడు చొరవ చూపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసే   పరిశ్రమలల ఉద్యోగాలలో స్థానికులకు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరాన్ని హర్యానా ప్రభుత్వం కూడా గుర్తించింది.  ఇండస్ట్రీలో, ఫ్యాక్టరీలలో ఇక ముందు 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు రిజర్వు చేసూ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఆర్ధినెన్స్ తీసుకువస్తున్నది.
స్థానికులకు ఉద్యోగాలలో 75 శాత కోట వాదన మొదట  తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 2019లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలలో ఇదొకటి. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం పేరు Andhra Pradesh Employment of Local Candidatesn in Industries/Factories Ac Act 2029.
రాష్ట్ర ప్రభుత్వరాయితీలతో నిమిత్తం లేకుండా పరిశ్రమలేదా ఫ్యాక్టరీలను ఏర్పాటుచేస్తే చాలు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని శాసించే ఈ చట్టానికి 21019 జూలై 23న ఆంధ్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇదెంతవరకు అమలవుతున్నదో ఇంకా నివేదికలు వెలువడలేదు. అయితే,  స్థానికులకు ఉద్యోగాలలో కోటా క్పలించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర కెక్కింది.

https://trendingtelugunews.com/english/breaking/chandrababu-responsible-for-postponemtent-of-house-site-distribution-minister-ranganatha-raju/

ఆతర్వాత మధ్య ప్రదేశ్ లో నాటి ముఖ్యమంత్రి కమల్ నాథ్  పరిశ్రమలలో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని ప్రకటించారు.
ఆ తర్వాత మహారాష్ట్ర లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామని ముఖ్యమంత్రి ఉద్దావ్ ధాకరే ప్రకటించారు. గుజరాత్, కర్నాటక రాష్ట్రాలు కూడా ఆంధ్ర రీతిలో చట్టాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
రాజస్థాన్ కూడా లోకల్ కోటా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ చట్టంలో ఉన్న విశేషమేమిటంటే, స్థానికంగా ఏదైనా ఉద్యోగానికి అర్హులు దొరకపోతే, కంపెనీలు స్థానిక యువకులకు శిక్షణ ఇచ్చి రిక్రూట్ చేసుకోవలసి ఉంటుంది.
హర్యానా చట్టంలో ఏ స్థాయి ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రకటించాలనే విషయాన్ని కూడా స్ఫష్టం చేస్తున్నారు. హర్యానా చట్టం కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రయివేటు యాజమాన్యం కింది నడిచే ట్రస్టులకు, కంపెనీలకు,  సొసైటీలకు, లిమిటెడ్ లయబిలిటి పార్టనర్ షిప్ సంస్థలకు కూడా వర్తింప చేస్తున్నారు.
హర్యానా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దుష్యంత్ చౌతాలా ఈ విషయం వెల్లడించారు. ఆయన జన నాయక్ పార్టీ బిజెపి ప్రభుత్వంలో భాగస్వామి. స్థానికుల ఉద్యోగాల కోటో అనేది ఆయన ఎన్నికల వాగ్దానం.
కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలలోనే కాదు, ఇప్పటికే ఏర్పాటయిన యూనిట్లలోని ఉద్యోగాలకు కూడా ఈ ఆర్దినెన్స్ వర్తిస్తుందని ఆయన చెప్పారు. అయితే, పాత పరిశ్రమలలో ఇప్పటికే భర్తీచేసిన ఉద్యోగాలకు ఇది వర్తించదు.
కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేటపుడు ఉద్యోగాలలో 75 శాతం స్థానికులకు కేటాయించాలని శాసన తయారు చేసేందుకు హర్యానా ప్రభుత్వం సోమవారం నాడు చర్యలు మొదలుపెట్టింది.
దీనికోసం ఒక ఆర్డినెన్స్ తీసుకురాావాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సోమవారం నాడు ప్రభుత్వం సూత్ర ప్రాయంగా అమోదించింది. వెంటనే ఆర్డినెన్స్ తయారు చేయించే పనిలో పడింది. హర్యానా స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్దినెన్స్ 2020 (Haryana state employment of local candidates ordinance 2020) పేరుతో ఈ ఆర్డినెన్స్ జారీ అవుతుంది. వచ్చే క్యాబినెట్ లో ఆర్డినెన్స్ ఆమోదిస్తారు.
రాష్ట్రంలో ప్రయివేటు యాజమాన్యాల కింద ఏర్పాటయి , ఉద్యోగావకాశాలున్న ప్రతి సంస్థలో, పరిశ్రమలో, సొసైటీలో నెలసరి జీతం రు. 50వేల లోపు ఉద్యోగాలన్నింటిని 75శాతం ఉద్యోగాలను స్థానికులు కేటాయించాలి. పరిశ్రమ ఏర్పాటుచేసిన జిల్లాలనుంచే యాజమాన్యాలు ఈ కోటా కింద తమకిషమయిన వారినే తీసుకోవచ్చు.
ఉద్యోగానికి అర్హులైన వారు అందుబాటులో లేనపుడు ఇతర ప్రాంతాాలనుంచి ఎంపిక చేసుకునేందుకు ఆర్డినెన్స్ లో కొన్ని మినహాయింపులు కూడా పొందుపరుస్తున్నారు.
ఆర్డినెన్స్ పాస్ అయిన మరుక్షణం నుంచి అన్ని పరిశ్రమల నియమాకాలకు ఇది వర్తిస్తుంది.