అంతా లొంగి అణగి మణగి ఉండాలనేది జగన్ లక్ష్యం: కెఎస్ జవహర్

(కెఎస్. జవహర్, మాజీ మంత్రి)
వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితులను బెదిరించి లొంగతీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా దళితులకు వచ్చిన వెసులుబాటు లేకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాను.
డాక్టర్ సుధాకర్, మాజీ ఎంపీ హర్షకుమార్, రాజేష్ లను అణచేయడంతో సహా దళిత రాజధాని అమరావతిని నాశనం చేసేందుకు జగన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
డాక్టర్ సుధాకర్ విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. న్యాయాస్థానం కూడా తీవ్రంగా స్పందించింది.
డా.సుధాకర్ విషయంలో వచ్చిన అప్రతిష్టను తొలగించుకునేందుకు, కేసు నుంచి బయటపడేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని దళిత మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలి. కేబినెట్ లోని దళిత మంత్రి సుధాకర్ తల్లికి ఫోన్ చేసి కేసును విత్ డ్రా చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు.
కానీ డాక్టర్ సుధాకర్ ను, దళితులను వేధింపులకు గురి చేసిన జగన్ కు కాళ్లు మొక్కతూ ద్రోహులుగా మిగలకండి. సుధాకర్ తల్లి దగ్గరకు వెళ్లిన మంత్రి అన్నం తింటున్నారో, గడ్డి తింటున్నారో అర్ధం కావడంలేదు. సుధాకర్ కు న్యాయం చేయకపోగా అన్యాయం చేయాలని చూస్తే దళిత జాతి చూస్తూ ఊరుకోదు.
లొంగి పోయి బానిసలుగా బతకడంకంటే పోరాడి ప్రాణాలు పోయినా పర్లేదని సుధాకర్ నిరూపించారు.
ఆయనకు దళితుల తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నాం. బెదిరించి లొంగతీసుకోవాలని చూసిన మంత్రిని బర్తరఫ్ చేయాలి. ప్రపంచం మొత్తం జగన్మోహన్ రెడ్డిని చూసి తలదించుకుంటోంది. వైసీపీ పాలనలో మానవ హక్కులు హరింపబడుతున్నాయి. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా దళిత రాజధానిని ధ్వంసం చేయలేరు. జగన్ అహంకారం ఎన్నాళ్లో సాగదు. డాక్టర్ సుధాకర్ కు మా మద్దతు ఉంటుంది. ప్రభుత్వం బుద్ది తెచ్చుకుని సుధాకర్ కు న్యాయం చేయాలి.