తెలంగాణలో మొదటి కరొనా కేసు

 మొట్టమొదటి సారి తెలంగాణలో కరొనా వైరస్ పాజిటివ్ (కోవిడ్ 19) కేసు బయపడింది. దేశంలో తాజాగా వెల్లడయిన రెండు కేసులలో ఇదొకటి. మొదటి కేసు ఢిల్లీ నుంచి రిపోర్టయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
 తెలంగాణ లో పాజిటివ్ గా తేలిన వ్యక్తి దుబాయ్ నుంచి వచ్చాడు. అయితే, అతని ట్రావెల్ హిస్టరిని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఢిల్లీ పాజిటివ్ కేసు ఇటలీ సందర్శించి వచ్చిన వ్యక్తి.
ఇరువురికి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించి, పరిశీలనలో ఉంచినట్లు. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శాఖ తెలిపింది.
ఇది ఇలా ఉంటే ఇండియాలో మొదటి కరొనా పాజిటివ్ కేసు కేరళలోని త్రిచూర్ లో కనుగొన్నారు. వైద్యపరీక్షలో పాజిటివ్ గా కనిపించిన ఈమే  చైనావూహాన్ వైద్య విద్యార్థి. ఆమెకు అక్కడి ప్రభుత్వం ఆసుపత్రిలో  చికిత్సచేశారు. ఫిబ్రవరి 20 న విడుదల చేశారు. తర్వాత కేరళ నుంచే మరో మూడు కేసులును కూడా గుర్తించారు. వారందరికి చికిత్స చేసి , నయమయ్యాక విడుదల చేశారు.
టివిఎస్ మోటార్సకు కరొనా వైరస్ దెబ్బ
ఫిబ్రవరినెలలో ద్విచక్రవాహనాల సేల్స్ 15.39శాతం పడిపోయాయని టివఎస్ మోటార్ కంపెనీ సోమవారం నాడు వెల్లడించింది.దీనికి కారణం కరొనా కల్లోలం వల్ల విడిభాగాల సరఫరా ఆగిపోవడమేనని కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరిలో 2,53, 261 వాహనాలు అమ్ముడు పోయాయి. దీనికి బిఎస్-4ప్రమాణాలను తగ్గించడం కూడా కొంత పనిచేసిందని కంపెనీ పేర్కొంది. 2019 ఫిబ్రవరిలో టివిఎస్ కంెనీ 2,99,352 వాహానాలను విక్రయించింది.
కరొనా వైరస్ వ్యాప్తి వల్ల బిఎస్-4 వాహనాలకు అవసరమయిన కొన్ని విడిభాగాల సరఫరా ఆగిపోయిందని,దీనిని సరిచేసేందుకు చర్యలుతీసుకుంటున్నామని కంపెనీ తెలిపింది.