తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్, ఎవరీమె?

తెలంగాణ బిజెపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి, సికిందరాబాద్ మాజీ ఎంపి బండారు దత్తాత్రేయ ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. ఆయన వాజ్ పేయి ప్రభుత్వంతో పాటు మోదీ తొలి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.
తమిళనాడు కు చెందన తమిళిసై సౌందర రాజన్ ను తెలంగాణ గవర్నర్ గా నియమించారు.
ఎవరీ సౌందర రాజన్ ?
ఆమె తమిళనాడు బిజెపి అధ్యక్షులుగా ఉన్నారు.
గత లోక్ సభ ఎన్నికలయిపోయినప్పటినుంచి ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తీసేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆమె నాయకత్వంలో పార్టీ ఏ మాత్రం ఎదగలేదని విమర్శ ఉంది. దానికి తోడు  మొన్నలోక్ సభ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసిన అయిదు స్థానాలలో ఓడిపోయింది. ఆమె తూతుకుడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  ఆమెను ఇపుడు గవర్నర్ పదవి ఇచ్చి రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి పాత్ర లేకుండా చేశారు. రాష్ట్రానికి బిజెపి అధ్యక్షుడిగా ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న వారిని నియమించాలని చూస్తున్నారు. ఈనేపథ్యంలో తమిళనాడు నుంచి తప్పించి  ఆమెను తెలంగాణ పంపించారని తెలిసింది.
తమిళిసై  సౌందర రాజన్ నేపథ్యం
తిమిళిసై కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చారు.ఆమె తండ్రి తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కమరి ఆనందన్ కూతురు. ప్రఖ్యాత వ్యాపారవేత్త హెచ్ వసంతకుమార్ మేనకోడలు. వైద్యం చదువుతున్నపుడు మద్రాస్ మెడికల్ కాలేజీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. డాక్టర్ కోర్స్ చదివాక ఆమె గైనెకాలజిస్టుగా జీవితం ప్రారంభించారు.
కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చినా ఆమె చిన్నవయసులోనే బిజెపికి దగ్గరయ్యారు. 1999లో చెన్నై సౌత్ డిస్ట్రిక్ట్ మెడికల్ వింగ్ కార్యదర్శిగా పని చేశారు. తర్వాత దక్షిణ రాష్ట్రాల బిజెపి మెడిలక్ వింగ్ గా పని చేశారు. తర్వాత 2007లో తమిళనాడు పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆపై 2010లో పార్టీ వైస్ ప్రెశిడెంట్ అయ్యారు. 2013లొ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమెకు తమిళనాడు సుష్మా జీ అని పేరుంది.
జాతీయ నాయకులు తమిళనాడు వచ్చినపుడు వారి ప్రసంగాలను అనువాదం చేసి ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో ఆమె ఎపుడూ విజయవంతం కాలేదు. రెండు సార్లుఅసెంబ్లీకి కూడా పోటీ చేశారు ఓడిపోయారు.
రాజ్ భవన్ కి ప్రగతి భవన్ కి మధ్య గ్యాప్ పెరుగుతుందా?
తమిళ అయ్యంగారైన ఇఎస్ ఎల్ నరసింహన్ తో ముఖ్యమంత్రి  కెసిఆర్ కు  మంచి సంబంధాలున్నాయి. అవి రాష్ట్ర పరిపాలనకే కాకుండా వ్యక్తిగత ఆశీస్సుల దాకా వెళ్లాయి. ముఖ్యమంత్రి బ్రాహ్మణోత్తముడికి పాదాభివందనం కూడా చేసేవారు. అయితే, ఇలాంటి పవిత్ర బంధం తమిళిసై సౌందరాజన్ సాధ్యం కాకపోవచ్చు.
బిసి నాయకురాలు
తమిళనాడులో కొయంబత్తూరు,తుత్తుకుడి,కన్యాకుమారి,తిరునల్వేలి, విరుద్ధ్ నగర్  ప్రాంతాలలో బలమయిన వర్గంగా ఉన్న నాడార్ కులం నుంచి వచ్చారు.తెలంగాణలో గౌడ్ , ఆంధ్రలో ఈడిగ, కేరళలో ఇళావా కులమే నాడార్. అనేక ఉప కులాలున్న నాడర్ కమ్యూనిటీ బిసిల కిందికొస్తుంది.
తమిళనాడు పార్టీలో ఆమెకు కొంత వ్యతిరేకత ఉన్నా జాతీయ స్థాయిలో పార్టీలో  మంచిపేరుంది. అందుకే సామాజిక, రాజకీయ, తాత్విక కారణాల వల్ల రాజ్ భవన్ కి, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరుగుతుంది. తమిళనాడులో పార్టీ ని బలపర్చలేకపోయినా, ఆమె తెలంగాణలో ఆపని చేయవచ్చని అనుకుంటున్నారు.
ఈ రోజు జరిగిన మరిన్ని నియమాకాలు:
హిమాచల్ గవర్నర్ గా ఉన్న కల్రాజ్ మిశ్రాను రాజస్థాన్ కుబదిలీ చేశారుు. భగత్ సింగ్ కోశ్యారినీ మహారాష్ట్ర గవర్నర్ గా నియమించారు. ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ను కేరళ గవర్నర్ గా నియమించారు.

https://trendingtelugunews.com/puzzle-solved-wonder-kids-are-from-kolkata/