ఒక తెలంగాణ టిడిపి కార్యకర్త పిలుపు ఇది

ఇది ఆంధ్రోళ్ల పార్టీ  అని బ్రాండ్ వేసి తెలుగుదేశం పార్టీని టిఆర్ ఎస్ తరిమేసే పని చేసింది. అయితే, అది తప్పని తెలంగాణలోని ఏ తెలుగుదేశం కార్యకర్తను అడిగినా చెబుతాడు. తెలంగాణలో టిడిపి బలంగా ఉందని, అక్కడ పార్టీని రద్దుచేసిన, మరొక పార్టీలో విలీనం చేసినా కార్యకర్తలకు ఆగ్రహం తెెప్పిస్తుంది. అందుకే మేం పోరాడతాం అంటున్నారు. ఈ ఉత్సాహాన్ని ఒక కార్యకర్త ఇలా చెప్పాడు.

(ఎన్టీ ఆర్ జయంతి సందర్భంగా రాసిన నాలుగు ఇన్ స్పైరింగ్  ముక్కలు)

నువ్వు గుర్తొస్తే వణుకుపుట్టేలా
నీ స్వరం వింటే సద్దుమణిగేలా
నీపేరే గెలుపుకు పర్యాయపదంలా
నీతో పోటి అంటేనే పారిపోయేలా
పోరాడు.

వెళ్ళు…మళ్ళీ… మళ్ళీ పోరాడు

పరిక్షించే వాడు సిగ్గుపడేలా
ప్రశ్నించేవాడు తలదించేలా
వెక్కిరించేవాడు విలువిచ్చేలా
జన్మనిచ్చిన వాళ్ళు గర్వపడేలా
పోరాడు
ఓపిక ఉన్నంత వరకు కాదు
ఊపిరి ఉన్నంత వరకు

నీదే విజయం💐
మీ
శ్రవణ్ కుమార్

( తెలంగాణ తెలుగుదేశం వాట్సాప్ గ్రూప్ నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *