షాకింగ్ న్యూస్.. నల్లగొండలో పట్ట పగలు 40 కోట్లు (వీడియో)

అవును ఇది నిజంగా విన్నా, చూసినా షాక్ కు గురి కావాల్సిందే. నల్లగొండలో పట్టపగలే 40 కోట్ల ముచ్చటేందో తెలియాలంటే కింద వీడియో చూడండి. వివరాలు చదవండి.

నల్లగొండ పట్టణంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా బహిరంగంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 కోట్ల రూపాయలను ఓపెన్ ట్రాలీలో తరలించడానికి రెడీ అయ్యారు బ్యాంకు అధికారులు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

నల్లగొండ లోని పెద్ద గడియారం సెంటర్ లో ఉన్న ఎస్ బిఐ ప్రధాన కార్యాలయం నుంచి బ్యాంకు అధికారులు ఇతర బ్రాంచీలకు పంపేందుకు 40 కోట్ల రూపాయలను టాటా ఏస్ ట్రాలీ వాహనంలో తరలించేందుకు ప్రిపేర్ అయ్యారు. మంచిగా కట్టలన్నీ ఆ ఓపెన్ ట్రాలీలో సర్దుతున్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే ఇలా తరలించేందుకు ఏర్పాటు చేయడం వివాదం రేపింది. విషయం తెలుసుకుని బ్యాంకు దగ్గరకు వచ్చి అడ్డుకున్నారు పోలీసులు. రూ.40 కోట్లను గ్రామీణ వికాస్‌ బ్యాంకుకు తరలించేందుకు ట్రాలీ ఆటోలో నోట్ల కట్టలు నింపిన ఘటన చూసి పోలీసులు షాక్ అయ్యారు. బ్యాంకు సిబ్బంది, డబ్బు తరలించే వ్యాన్ సిబ్బంది పెళ్లిళ్ల కారణంగా సెలవులో ఉన్నారని, డబ్బు తరలించడం అనివార్యం కావడంతో ఇలాంటి ఏర్పాట్లు చేశామని అంటున్నారు.

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ బాషా, ఎస్‌ఐ చంద్రశేఖర్‌లు బ్యాంకు దగ్గరకు వెళ్లారు. భారీ మొత్తంలో నగదును పంపించేటప్పుడు బ్యాంకు సెక్యూరిటీ వాహనంలో తరలించాలని తెలిపారు. సిబ్బంది లేకపోతే పోలీసుల సహకారం తీసుకోవాలే తప్ప ఇలా పంపించడం సరికాదని అధికారులకు సూచించారు. తర్వాత పకడ్బందీ సెక్యూరిటీతో ఆ నగదును గ్రామీణ వికాస్‌బ్యాంకుకు తరలించారు. కానీ తర్వాత పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఆ డబ్బును తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *