Home English టిఆర్ ఎస్ ను జిల్లా నుంచి తరిమేస్తా…

టిఆర్ ఎస్ ను జిల్లా నుంచి తరిమేస్తా…

413
0

నల్గొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకటరెడ్డి మరొకసంచలన ప్రకటన చేశారు.  ఈసారి ఆయన నల్గొండ జిల్లానుంచి టిఆర్ ఎస్ ను తరిమేస్తానని అంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేస్తాని  ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. నల్గొండ పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను భిక్షగాళ్లలా చూస్తోందన్నారు. కాలుష్యం వెదజల్లే థర్మల్ ప్లాంట్‌ను దామరచర్లలో ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా అంతట పర్యటించి, మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఎవరికీ డిపాజిట్లు దక్కకుండా చేస్తానని ఆయన ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here