జనసేన పవన్ సంచలన సంక్రాంతి సందేశం…

ఆంధ్రాయువకులు, ప్రజలకు తెలంగాణ స్ఫూర్తి కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంక్రాంతి సందేశం ఇచ్చారు. ఈ రోజు గుంటూరు జిల్లా పెద్ద రాపూరులో మాట్లాడుతూ ఆయన ఈ పిలుపు నిచ్చారు.

‘తెలంగాణ రాష్ట్రం కల నిజం చేసుకునేందుకు అక్కడి యువత, ప్రజలు అందరు రోడ్లమీదకు వచ్చి పోరాటం చేశారు, సాధించారు, ఆ స్పూర్తితో మన ఆంధ్ర ప్రదేశ్ యువత ముందుకు రావాలి,’ అని పవన్ పిలుపు నిచ్చారు.

సంక్రాంతి పండుగను అభిమానుల మధ్య జరుపుకునేందుకు జనసేన అధినేత ఈ రోజు గుంటూరు జిల్లా పెద్ద రాపూరు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడి కి వచ్చారు. మనోహర్ ఇతర జనసేన నేతలు ఆయన ఘన స్వాగతం పలికారు. మనోహర ఫార్మ్ హౌస్ ను ఆయన కలియ తిరిగారు. ఈ సందర్భంగా  పవన్ చేసిన ప్రసంగం ఇది.

‘తెలంగాణకు  అన్యాయం చేసింది ఆంధ్రా ప్రజలు కాదు, ఆంధ్రా నాయకులు అని తెలంగాణ నాయకులకు ఎదురు మాట్లాడింది ఆనాడు నేను మీ తరపునే  నా మీద దాడులు జరిగినా, నా ఆస్తులు ధ్వంసం చేసిన నేను భయపడలేదు,’ అని వివరణ ఇచ్చారు.

అణగారిన వర్గాలవారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, ఇక్కడి డెల్టా ప్రాంత రైతుల కంట ఆనందం చూడాలి అందుకోసం జనసేన పనిచేస్తుంది. కులమతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలంటే జనసేన ప్రభుత్వం రావాలి. నేను పార్టీ నాయకులతో చర్చించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, రుణాలు అందించడం, కౌలు రైతులకు అండగా ఉండటం కోసం పాలసీలు తీసుకొస్తున్నాను.  ఎంతసేపు నేను, నా బిడ్డలు, వారి బిడ్డల భవిష్యత్తు కోసం చూసుకోకుండా అందరికి అవకాశాలు కల్పించేందుకు జనసేన పనిచేస్తుంది.

ఫిబ్రవరి రెండో వారంలో రైతు సదస్సులు పెట్టబోతున్నాం, వాటి ద్వారా రైతాంగ సమస్యలపై చర్చించి నివారణ ప్రణాళికలు తీసుకురానున్నాం.

 

ఇప్పటి తప్పుడు రాజకీయ వ్యవస్థ మార్చాలంటే ఒక్క యువత ద్వారానే సాధ్యం,ఒక కులం, మతం సమస్య అంటే అందరూ ఒకచోటకు వస్తారు మరి వ్యవస్థలో సమస్య ఉన్నప్పుడు యువత అందరూ ముందుకు రావాలి –

‘జాగో రే జాగో’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం యువతను ఈ చలికాలంలో కూడా ఒకచోటకు చేర్చి మార్పు కోసం చర్చించాలి, మీ భవితలు మీరే నిర్ణయాలు తీసుకోవాలి

2019 మనకు మొదటి ఎన్నికలు కాదు, ఆఖరి ఎన్నికలు కాదు, ఈరోజు ఒక్క అడుగు కావచ్చు, రేపు 10 అడుగులు అవుతుంది మార్పు తప్పకుండా వస్తుంది –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *