రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ పూర్తి

ఇపుడు జరుగుతున్న 2019 సార్వత్రిక ఎన్నికల  రెండో దశ పోలింగ్‌ పూర్తయింది.

దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. హేమమాలిని,దేవేగౌడ వంటి ప్రముఖల రాజకీయ భవిత్యవం ఈ దశ పోలింగ్ తో ముడివడి ఉంది.

కర్ణాటకలోని మండ్య, పశ్చిమ బెంగాల్‌, మిజోరంలలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

మిగతా రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడు, యూపీలోని మథురలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో సాయంత్రం 5గంటలకే పోలింగ్ ముగిసింది.

మథురలో రాత్రి 8 గం.ల వరకు పోలింగ్‌ జరిగింది. నిర్ణీత గడువు ముగిసే సమయానికి పోలింగ్‌ శాతం 61.12 గా నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 75.27% పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్ 43.37% పోలింగ్‌ నమోదైంది.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే

అసోం – 73.32%
బిహార్‌ – 58.14%
ఛత్తీస్‌గఢ్‌ – 68.70%
జమ్ముకశ్మీర్‌ – 43.37%
కర్ణాటక – 61.80%
మహారాష్ట్ర – 55.37%
మణిపూర్‌ – 74.69%
ఒడిశా – 57.41%
పుదుచ్చేరి – 72.40%
తమిళనాడు – 61.52%
ఉత్తర్‌ప్రదేశ్‌ – 58.12%
పశ్చిమ బెంగాల్‌ – 75.27%

రేపటికి ఈ వివరాలు మారవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *