Restless శ్రీదేవి Rest in Peace.

అన్ని వయసులవారూ శ్రీదేవి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు..కానీ 50-60 మధ్య వయసువారికి శ్రీదేవి అంటే ప్రత్యేక అభిమానం అని నేనంటాను. ఎందుకో చెబుతున్నా…

కారణం బేబీ శ్రీదేవి నుంచి చూసాము కాబట్టి.
నావరకైతే బేబీ శ్రీదేవి అనగానే గుర్తొచ్చేది..రాఘవేంద్రరావు తండ్రి ప్రకాష్‌రావు దర్శకత్వం లో వచ్చిన నా తమ్ముడు సినిమా పాట…స్కూల్ ఫంక్షన్లో నెహ్రూ మృతికి తల్లడిల్లిన ఒక గులాబీ బాలగా చిన్నారి పాపలా పొన్నారి తోటలో అనే పాట…
ఆ తర్వాత శ్రీమంతుడులో చిన్నప్పటి జమునగా చిట్టిపొట్టి బొమ్మలు…

ఇక anr కూతురుగా భార్యాబిడ్డలు లో చక్కనయ్యా చందమామా…

మరి కొన్ని… అందరికీ తెలిసిన,ntr మనవరాలిగా బూచాడమ్మా బూచాడు…
https://www.youtube.com/watch?v=CjoatqtTIzw
ఇక యశోదాకృష్ణ లో పొన్నలు విరిసే వేళలో…
https://www.youtube.com/watch?v=ky_52Gc0OzY
బాలభారతం లో కౌరవుల చెల్లెలు దుస్సలగా….
ఇంకొంచం పెద్దదయింది…anglo indian girl గా my heart is beating…
https://www.youtube.com/watch?v=PtEvReUAm6Q
టీన్స్ లోకి వచ్చేసింది…అక్కడ పదహారేళ్ల వయసు(తమిళ్)..ఇక్కడ అనురాగాలు,మా బంగారక్క…
అక్కడితో వదిలేసారా నువ్వే నా శ్రీమతి అంటూ వచ్చిన ఈ సినిమా పాటా చూడండి..
హిందీలో stardom వచ్చాక నషీలీ జవానీ అంటూ ఈ సినిమా డబ్ చేయబోతే రైట్స్ కొని రిలీజ్ అవ్వకుండా చేసింది…
https://www.youtube.com/watch?v=-dj0FOWu5xk
అసలు పదహారేళ్ల వయసు తర్వాత వెనుతిరిగి చూసిందే లేదు…
తాత ntr పక్కన వేటగాడు,సర్దార్ పాపారాయుడూ…ఎన్నెన్నో..
https://www.youtube.com/watch?v=3q4MU5UTTbE
మరో తాత anr కు biggest hit ప్రేమాభిషేకం…
https://www.youtube.com/watch?v=MVCuY4v4me0
శోభన్ తో తొలిసారే కార్తీక దీపం లో ఒక బరువైన పాత్ర…
https://www.youtube.com/watch?v=DhITUTgVR48
కృష్న తో ఎన్నెన్నో హిట్స్..సోల్వా సాల్ అంటూ పదహారేళ్ల వయసు flop అయినా హిమ్మత్‌వాలా తో మళ్లీ హిందీ కి పరిచయం చేస్తే అక్కడా విజయ బావుటా..
https://www.youtube.com/watch?v=1XXVw9skvXs
ఇక కమల్ కాంబినేషన్…made for each other…ఆకలిరాజ్యం కన్నెపిల్లవని కన్నులున్నవని కావచ్చు…
https://www.youtube.com/watch?v=Gi45vU7M-Yo
ఎదలో తొలివలపే అంటూ ఎర్ర గులాబీలు కావచ్చు..
https://www.youtube.com/watch?v=S7VIupvax5Q

ఇక రజనీ తో జానీ,ధర్మయుద్ధం….
https://www.youtube.com/watch?v=tx7zXF-aAkc
తండ్రి anr తో…నాగార్జునతో ఆఖరి పోరాటం,ఖుదాగవా,గోవిందా గోవిందా…
వెంకటేష్ క్షణక్షణం ఆహా ఓహో అన్నా మెడ మీద చారలు మాతరం ప్రేక్షకులు ప్చ్ అనేశాం..
ఇక హిందీలో తన శత్రువు జయప్రద రిజక్ట్ చేసిన నగీనా….అంతకుమించి యష్ చోప్రా చాందిని…
https://www.youtube.com/watch?v=FiuAYKk7a6U
శేఖర్ కపూర్ mr.India…..
https://www.youtube.com/watch?v=9FjuBvzF1E4
ఇక అప్పట్లో తన చెల్లెలు శ్రీలత పెళ్లి చేసుకుని ఈవిడ ఆస్తి కొట్టేసిపోయింది..
తల్లి అనారోగ్యం,బోనీ కపూర్ పరిచయం…చివరికి కడుపులో ఏదో ట్యూమర్ ఉందనుకున్న అమాయకురాలు..
ఆ మధ్య భర్త తో కలిసి తిరుపతి వచ్చిన ఫోటోలు చూసినప్పుడే అభిమానుల గుండెలు బద్దలయ్యాయి…
ఆ తర్వాత ఇంగ్లిష్ వింగ్లిష్ వచ్చింది…
ముక్కుకు cosmetic surgery చేయియించుకోక ముందు ఒక అందం..కృష్ణార్జునులు సినిమా నుంచి మరో అందం…
కానీ వయసొచ్చాక ఆ అందం పోయి మైకేల్ జాక్సన్ లా కనిపించించిది…
పాపం ఆ మొగుడూ డబ్బు తగలేసాడన్నారు..
చిన్నప్పటి నుంచీ restless…ఇప్పుడూ అందం కోసం చేసిన పనులే ప్రాణం మీదకు తెచ్చాయేమో…
rest in peace.

(పేస్ బుక్ పోస్టు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *