వానల కోసం రాయలసీమలో ఆక్రందన, ఇలా భజన యాత్రలు (వీడియో)

రాయలసీమలో వర్షాల్లేవు.  విత్తనాలు విత్తుకోవడానికి సరైన వర్షం రాలేదు. ఒక పదను వాన కూడా కురవలేదు.
ఈ  పరిస్థితిని  గ్రామాలలలో  విభిన్న రూపాలలో వ్యక్తం చేస్తున్నారు.
సకల చరాచరాలను కాపాడే ఆ దేవుడైనా తమ బాధలను పట్టించుకోవాలని కోరుకొంటున్నారు.
ఆ దేవుడు కరుణిస్తాడో లేదో కానీ కనీస ఆ నెపంతో కొంత స్వాంతన పొందుతారు.
నిరాశలో కూరుకుపోకుండా ఆత్మవిశ్వాసం తో నెగ్గుకరావడానికి ఇలా కార్యక్రమాలు కొనసాగిస్తారు.
ఇది ఒక రకంగా జానపదుల నిరశన. చిన్న పిల్లవాడు అమ్మతో ఎలా మారం చేస్తాడో.. అలా గ్రామ దేవతల వద్ద, దేవుళ్ళ వద్ద జానపదులు దుఖంతో కూడిన బాధను వ్యక్తం చేస్తారు.
సీమ వాసులు ఇలా కొనసాగించే కార్యక్రమాలతోపాటు తమ నీటి హక్కులకై ఉద్యమాలకు సిద్దమైనపుడే ఇంకొంత ప్రయోజనం ఉంటాది.
(కళ్యాణదుర్గం మండలం, యర్రంపల్లి వారు రాములపటం తో వానకోసం ఏడు గ్రామాలను భజనలు చేస్తూ నడిచారు.)
-డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి