వారణాశి నుంచి మోదీ ఇలా నామినేషన్ వేస్తారు

ప్రధాని నరేంద్ర మోదీ వారణాశి నియోజకవర్గం నుంచి చాలా అట్టహాసంగా నామినేషన్ వేయబోతున్నారు.

ఈ సారి అక్కడ పేరుమోసిన అభ్యర్థులెవరూ ఆయన మీద పోటీలో లేరు. ఇప్పటి దాకా ఒక్క పార్టీ కూడా అభ్యర్థి పేరును ప్రకటించలేదు. పోటీ చేస్తామని చెబుతున్నవారంతా కేవలం వ్యక్తులే.

కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు ఉత్తర ప్రదేశ్ నుంచి పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది, అయితే, ఆ జాబితాలోవారణాశి పేరు లేదు.

అందువల్ల అఖండ విజయం కళ్లముందు కనబడుతున్న ఉత్సాహంతో, రెండోసారి వారణాసి నుంచి రికార్డు మెజారిటీ సాధించేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారు.

ఇప్పటి వరకు అక్కడ పోటీ లో ఉన్నవారు : భీమ్ ఆర్మి పార్టీ సంస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్, యాంటి కరప్షన్ డైనమిక్ పార్టీ సంస్థాపకుడు జస్టిస్(రిటైర్డు) సిఎస్ కర్ణన్, బిఎస్ ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ (ఆహారం బాగలేదని విమర్శించినందుకు ఆయననుతొలగించారు), అభినందన్ పాథక్ ( మోదీ లాగే ఉండే అభ్యర్థి). తమిళనాడు 111 మంది రైతులు వచ్చి అక్కడ నామినేషన్ వేయాలనుకున్నారు. అయితే, బిజెపి అధ్యక్షుడు షా జోక్యంతో వాళ్లు ఈ ప్రయత్నం విరమించుకున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో మోదీ నామినేషన్ చాలా అట్టహాసంగా వేయబోతున్నారు.

ఈ నెల 26వ తేదీన ఆయన నామినేషన్ వేస్తున్నారు. ఒక రోజు ముందే అంటే ఏప్రిల్ 25 తేదీనే ఆయన వారణాశి చేరుకుంటారు.

25వ తేదీన బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి దశ్‌అశ్వమేథ్ ఘాట్ వరకు జరిగే రోడ్ షో లో మోదీ పాల్గొంటారు.

ఆ తర్వాత కాల భైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం గంగా హారతిలో పాల్గొంటారు. రాత్రి కార్యకర్తల నుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి మేధావులతో కూడా సమావేశమవుతారు.

ఏప్రిల్ 26న నామినేషన్ వేయడానికి ముందు కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

అనంతరం ర్యాలీగా వెళ్లి మోదీ నామినేషన్ దాఖలు చేస్తారు.

2014లో కూడా మోదీ ఇదే పద్ధతిలో నామినేషన్ వేశారు.

2014 లో వారణాసితో పాటు వడోదర(గుజరాత్‌) నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు.

అయితే వడోదర కు రాజీనామా చేసి వారణాశి నియోజకవర్గానికే ఆయన ప్రానిధ్యం వహించారు. ఆ ఎన్నికల్లో గెలిచాక మూడేళ్ల తర్వాత ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపుడు ఆయన వారణాశికి వచ్చి ప్రచారం చేశారు. మళ్లీ ఇదే రావడం.

నాటి ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై 3.71 లక్షల ఓట్ల తేడాతో నరేంద్ర మోదీ విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *