హేమా హేమీలున్న లోక్ సభ మూడో దశ పోలింగ్ మొదలు…

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా, సమాజ్ వాది పార్టీ  పెద్దాయన ములాయంసింగ్‌ యాదవ్‌, ప్రఖ్యాత నటి జయప్రద, మేనకా గాంధీ కుమారుు వరుణ్‌ గాంధీ, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలె, సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్‌, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే వంటి ప్రముఖుల భవితవ్యం తేల్చనున్న లోక సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొద్ది సేపటి కింద మొదలయింది.

దేశంలో మొత్తంగా 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ని 116 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతున్నది.

రంగంలో 1,640 మంది అభ్యర్థులున్నారు. నిజానికి, మూడో దశలో భాగంగా 115 స్థానాల్లోనే జరగాలి. త్రిపురలోని త్రిపుర-తూర్పు లోక్‌సభ స్థానం ఎన్నిక రెండో దశ నుంచి మూడో దశకు వాయిదాపడటంతో మూడో దశ నియోజకవర్గాల సంఖ్య 116కు చేరింది.

అస్సాంలో నాలుగు, బీహార్ లో అయిదు, చత్తీష్ గడ్ లో 7, జమ్ము కాశ్మీర్ లో 1, కర్నాటకలో 14, మహారాష్ట్రలో 14, ఒదిషాలో 6, ఉత్తర ప్రదేశ్ లో 10, ప.బెంగాల్ లో 5, గుజరాత్ లో 26, కేరళలో 20, గోవాలో 2, దాద్రా నగర్ హవేలీ లో 1, డామన్, డయులో 1 నియోకవర్గాలు పోలింగ్ కు వెళ్ళాయి.
వోటు విలువయినదని, మీవోటు భవిష్యత్తులో దేశం పయనించే దిశను నిర్దేశిస్తుందని, అందువల్ల పెద్దసంఖ్యలో వోటేసేందుకు ముందుకురావాలని కోరుతూ ప్రధానమంతి మోదీ ట్వీట్ చేశారు. ఆయన అహ్మదాబాద్ లో వోటేస్తున్నారు. అక్కడ బిజెపి అభ్యర్థి అమిత్ షా.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *