కేశవరావుకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి కెసిఆర్

ఆర్టీసి సమ్మె గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడాలనుకుంటున్నట్లు, కాని ముఖ్యమంత్రి అందుబాటులో లేరని రాజ్యసభ్యుడు, టిఆర్ ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్ కె కేశవరావు చెప్పారు. ఆశ్చర్యం. ఆయన ఆర్టీసి   కార్మికులతో చర్చలు జరపాల్సిన అవసరం గురించి ముఖ్యమంత్రితో మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి అందుబాటులో లేని విషయాన్ని ఆయన స్వయంగా విలేకరులతో చెప్పారు.

నిన్న తాను ఇచ్చిన ప్రకటన అనుకోకుండా ఇచ్చానని, ప్రకటనకు ముందుగాని, తర్వాత గాను ముఖ్యమంత్రితో గాని మాట్లాడలేదని కేశవరావు చెప్పారు

ప్రకటనలో తాను  తన అభిప్రాయం చెప్పానని, ఇందులో మరొకరి ప్రోద్బలం లేదేని ఆయన స్ఫష్టత ఇచ్చారు. ఈ రోజు కేశవరావు ఇంకా ఎమి చెప్పారంటే…

ప్రభుత్వం, ఆర్టీసీ మధ్య చర్చలు జరగాలి. ఆత్మహత్యలు బాధించాయి.

ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని కలిసి చర్చలు జరపాలి

నేను నా అభిప్రాయాన్ని వ్యక్తంచేశాను.

సమ్మెతో పరిస్థితులు చేజారి పోతున్నాయనే అనుమానం వచ్చింది.

ప్రెస్ రిలీజ్ కు ముందుగాని, తర్వాత గానీ, సీఎం కేసీఆర్ గారితో నేను మాట్లాడలేదు.

సీఎం కేసీఆర్ తో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఆయన నాకు అందుబాటులోకి రాలేదు.

నా స్టేట్మెంట్ తో ఆర్టీసీ కార్మికులలో సమ్మె పరిష్కారం గురించి ఆశలు పెరిగాయి.

నేను చర్చలు జరుపుతానని అనలేదు. ఐనా సరే, మంచి జరుగుతుందని అనుకుంటే నేను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దం. సీఎం ఆదేశిస్తే ఖచ్చితంగా చర్చలకు దిగుతా.

ఇది పార్టీ సమస్య కాదు, ప్రభుత్వ సమస్య. కార్మికులు నాతో చర్చలకు సానుకూలంగా వుండటం మంచి పరిణామం.

ప్రభుత్వం నుంచి చర్చలు జరిపేందుకు నాకు ఎలాంటి అనుమతి రాలేదు.

నేను సోషలిస్టును. రాజ్యం వైపు ఎప్పుడూ ఉండను. కార్మికుల వైపే వుంటాను.

ఉద్యోగ సంఘాలు కొట్టుకోకుండా కలిసికట్టుగా ఉండాలి.

ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు.

ప్రభుత్వ ఉద్దేశం ఏంటీ అనేది నాకు తెలియదు. తెలిస్తే సమస్య పరిష్కారం అయ్యేది.