బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కన్నా(వీడియో)

నాటకీయంగా కన్నా లక్ష్మినారాయణ బిజెపి అధ్యక్షుడయ్యారు. నిజానికి ఆయన బిజెపి వదిలేసి, వైిసిపిలోచేరేందుకు ముహూర్తం నిర్ణయమయింది. అయితే, ఏమి జరిగిందో ఏమో, ఆయన వైసిపిలోచేరడం మానేశారు. ఆరోగ్యం బాగా లేదని ఆసుపత్రిలో చేరారు. తర్వాత బిజెపి అధ్యక్షుడయ్యారు. ఇదే తరహా రాజకీయమో అర్థంకాదు. ఆయనకు బిజెపి వైపు కమిట్ మెంట్  ఉంటుందా? ఎందుకంటే, వైసిపి వెళ్లడం మానేసి పదవీ బేరం పెట్టుకుని బిజెపిలోకి వచ్చాడు. వచ్చాక చేసిందేమిటి, వైసిపి నేత జగన్ ను ప్రశంసించారు. ఇదే మంత నేరం కాదు. అయితే, రానున్న రోజులలో వైసిసి, బిజెపి ల స్నేహానికి ఇది సూచన అనుకోవచ్చు. అయితే, జగన్ మనసులో కన్నా అంటే  ఎలాంటి భావం ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. అంతేకాదు, కన్నా నాటకీయం చూశాక, ఆంధ్రలో బిజెపిని సొంత కాళ్ల మీద నిలబడే పార్టీగా తీర్చిదిద్దాలన ఆకాంక్ష నేతలకు ఉన్నట్లు లేదు. అలావుంటే కన్నాకు ఈ పదవి ఇచ్చే వారే కాదు, పార్టీనే నమ్ముకున్న వారికి ఆ గౌరవం దక్కి ఉండేది.  చంద్రబాబు నాాయుడిని  ఓడించేంందుకు  జగన్ తో చేతులు కలిపేందుకు అభ్యంతరం లేని నాయకుడు బిజెపికి కావాలి. అదే జరిగింది. మోదీ నాయకత్వంలో ఉన్న బిజెపికి, ఇతర పార్టీలకు ఎలాంటి తేడాలేదని  ఇపుడు మరొక సారి రుజువయింది. కన్నా నియామకంలో బిజెపికి పనికొచ్చే పాయింట్స్ చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద గట్టిగా అరిచేశక్తి ఉంది. ఆయన వెనక కాపు జనబలం  ఉంది. ధర బలం  కూడా ఉంది. ఎటొచ్చి ఇదంతా ఎవరిని గెలిపించేందుకు ఉపయోగపడుతుంది?

ఏమయితేనేం,  హనుమానోపాసకుడయిన కన్నా బిజెపికి అధ్యక్షుడయ్యారు. ఆయన ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన ఉపన్యాసం వినండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *