పోలీసుల్లో చంద్రబాబు కుల సైన్యం దాక్కుని ఉంది, జగన్ ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ లో  లా అండ్ ఆర్డర్ మాయమైందని వైసిసి అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కొద్ది సేపటి కిందట హైదరాబాద్ లో   గవర్నర్ నరసింహన్ ను కలిశాక  తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘లా అర్డర్ ఎక్కడుంది. ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన 40 మంది డిఎస్పీలకు ఏకపక్షంగా పోస్టింగులు ఇచ్చారు. వారు యథేచ్ఛంగా వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు,’ అని చంద్రబాబు కులసైన్యం గురించి ఆయన వ్యాఖ్యానించారు.

జగన చేసిన మరిన్ని ఆరోపణలు…

1) – నిన్న మా పార్టీ బృందం ఢిల్లీలో సీఈసీని కలిసి రాష్ట్రంలో పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత జరుగుతోన్న అరాచకాలు, అన్యాయాలపై సమగ్రంగా వినతిపత్రం ఇచ్చింది. – అదే అంశాలపై ఈరోజు గవర్నర్ ను కలిసి.. రాష్ట్రంలో దిగజారుతోన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై వినతిపత్రం ఇచ్చాం.

2) – రాష్ట్రంలో ఎన్నిక రోజు.. ఎన్నిక తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి.. ఏరకంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ.. దాడులకు ఉసిగొల్పాడో గవర్నర్ కు వివరించాం.

3) – చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకొని వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెడుతోంది.

4) – మాజీ స్పీకర్ కోడెల వ్యవహారమే చూస్తే.. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్ లోకి వెళ్ళి.. డోర్ లాక్ వేసి.. తనంతట తానే చొక్కా చింపుకున్నాడు. కోడెల శివప్రసాద్. పోలింగ్ అధికారుల సమక్షంలోనే ఇదంతా జరిగినా.. ఎందుకు ఆయన మీద కేసు పెట్టలేదు?

5) – పోలింగ్ బూత్ లోకి వెళ్ళి.. డోర్ లు లాక్ చేసి.. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయటం నేరం కాదా? ఎందుకు ఇప్పటివరకూ కేసు పెట్టలేదు?

6) – అలానే గురజాల నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని.. ముస్లింలు, ఎస్సీల ఇళ్ళపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడులు చేసి కొట్టవచ్చా?

7) – ఇలా ప్రతి సందర్భంలోనూ.. కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిని రూమ్ లో బంధించి.. తెలుగుదేశం నేతలు భౌతికంగా దాడి చేస్తే.. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను విడిపించుకుని రావాల్సిన పరిస్థితి వచ్చినా.. ఎందుకు నిందితుల మీద కేసు పెట్టలేదు?

8) – పూతలపట్టులో పార్టీ దళిత అభ్యర్థి ఎంఎస్ బాబును తెలుగుదేశం పార్టీ నేతలు పోలింగ్ నాడే కొట్టారు. గాయాలై కుట్లు పడితే.. ఈరోజుకీ ఆసుపత్రిలో ఉన్నాడు. ఇప్పటివరకూ ఎందుకు కేసు పెట్టలేదు?

9) – రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? ఒకే సామాజిక వర్గానికి సంబంధించి 40 మంది డిఎస్పీలకు ఏకపక్షంగా పోస్టింగులు ఇచ్చారు. వారు యథేచ్ఛంగా వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు.

10) – నిందితుల మీద కేసులు పెట్టకుండా.. బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితికి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారింది. మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్ లలో పెట్టిన ఈవీఎంలను ఇష్టారాజ్యంగా డోర్లు ఓపెన్ చేసి.. తీసిన ఫోటోలు బయటకు వచ్చాయి.

11) – ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల దగ్గర తక్షణమే పారామిలటరీ పోలీసులను పెట్టాలి. కేంద్రం నిఘా పెంచాలి. వాటిని తమ పరిధిలోకి తీసుకోవాలి. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు.. ఆ కెమెరాల విజువల్స్ ఫీడు నేరుగా సీఈఓ, సీఈసీ పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈవీఎంలకు పూర్తి భద్రత కల్పించాలి.

12) – గత 5 ఏళ్ళుగా చంద్రబాబు చేసిన అనేక స్కాంలకు సంబంధించి.. వాటి ఆధారాలను పూడ్చేసే పనులను ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్నాడు. తనకు సంబంధించిన బినామీలకు, కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా నిధులు, చెక్కులు ఇస్తున్నాడు. దీన్ని నియంత్రించాలి. రాష్ట్ర సీఎస్ కు కేంద్రం తక్షణమే ఆదేశాలు ఇవ్వాలి.

13) – ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సెక్రటేరియేట్ ను దుర్వినియోగం చేస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు.

ఈవీఎంలపై చంద్రబాబు చేస్తోన్న విమర్శలపై స్పందిస్తూ..

14) – ఈవీఎంలకు సంబంధించి.. చంద్రబాబును ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాం. మీరూ అడగండి.

– 80 శాతం ప్రజలు ఓట్లు వేస్తే.. ఏ పార్టీకి ఓటు వేశారో.. వీవీ ప్యాట్ లో వారంతా చూశారు. రెండూ ఒకటే కనిపించాయి కాబట్టే.. ఓటర్లంతా సంతృప్తి చెందారు. ఏ ఒక్కరూ కంప్లైంట్ చేయలేదు. ఒకవేళ నేను ఓటు వేసినప్పుడు.. నాకు వీవీ ప్యాట్ లో ఫ్యాన్ కాకుండా.. సైకిల్ గుర్తు కనిపిస్తే నేనెందుకు ఊరుకుంటా. వెంటనే కంప్లైంట్ చేసి ఉండేవాడని కాదా?

15) – చంద్రబాబుకు అన్నీ తెలిసే.. తాను ఎవరికి ఓటు వేశానో తెలియదని సినిమాలో విలన్ పాత్ర పోషించే మాదిరిగా డ్రామాలు ఆడుతున్నాడు.
– వాస్తవానికి పోలింగ్ మొదలయ్యే ముందు.. అన్ని పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ ఉంటారు. ఈవీఎంలు ఏజెంట్లు అంతా తనిఖీ చేస్తారు. పోలింగ్ ఏజెంట్లతో 50 ఓట్లు చొప్పున మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంలలో నొక్కిన గుర్తు.. వీవీ ప్యాట్ లో కనిపించే గుర్తు మ్యాచ్ అయ్యాయో లేదో ఏజెంట్లు చూస్తారు. ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్లు ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని సంతకాలు చేస్తారు. ఆ తర్వాతే జనరల్ పబ్లిక్ కు ఓటింగ్ కు అనుమతిస్తారు.

16) – అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో సహా టీడీపీ ఏజెంట్లు కూడా.. అన్నీబాగా పని చేస్తున్నాయని సంతకాలు పెట్టలేదా? ఏరకంగా ఈరోజు చంద్రబాబు ఆరోపణలు చేస్తారు? ప్రజలను తప్పుదోవ పట్టించడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పనా?

17) – 2014లో వీవీ ప్యాట్ లు కూడా లేవు. మరి అప్పుడు ఆయన వాటిని మేనిప్యులేట్ చేసి.. సైకిల్ కు నొక్కించారా? నంద్యాల ఉప ఎన్నికలలోనూ ఇవే ఈవీఎంలు, ఇవే వీవీ ప్యాట్ లు. ఆ ఎన్నికల్లోనూ చంద్రబాబు మేనిప్యులేట్ చేసి గెలిచారా?

18) – సార్వత్రిక ఎన్నికల ముందు నాలుగు రాష్ట్రాల్లో.. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటకలలో ఎన్నికలు జరిగితే.. ఆ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆ పార్టీ కూటమి కట్టిన పార్టీలు గెలిచాయి. అప్పుడెందుకు చంద్రబాబు మాట్లాడలేదు?

19) – ప్రజా తీర్పు ఎటువైపు ఉందో.. గాలి తెలుసుకొని.. ఈరోజు చంద్రబాబు ప్రజల తీర్పును అవహేళన చేస్తున్నాడు. ఈయన అసలు మనిషేనా?

20) – ఆయన గెలిస్తే.. అన్నీ బాగున్నట్టా…. ఆయన ఓడిపోతే.. ఈవీఎంలపై నెపమా? ఇదేం రాజకీయం చంద్రబాబూ?

21) – తాను గెలిస్తే.. సింధూకు నేనే బ్యాట్ మెంటెన్ నేర్పాను… బిల్ గేట్స్ కు నేనే కంప్యూటర్ నొక్కటం నేర్పాను.. సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను… రాష్ట్రంలో స్ట్రీట్ లైట్ వెలగకపోతే నా కంప్యూటర్ లో ఇట్టే తెలిసిపోతుందని చంద్రబాబు మాట్లాడతారు.

22)  ఒకవేళ ఓడిపోతే సింధూ కోచ్ తప్పు.. నా కంప్యూటర్ కరెక్టు గానీ.. బిల్ గేట్స్ బటన్ సరిగా నొక్కలేదు… అని చంద్రబాబు మాట్లాడతాడు.

23) – 5 ఏళ్ళు చంద్రబాబు అధర్మ పాలన చూశారు. చంద్రబాబు చేసిన అన్యాయాలు, అక్రమాలు చూశారు. 5 ఏళ్ళ చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగెత్తిపోయి.. ఈ పాలన మాకొద్దు.. బై బై బాబు అని చెప్పి ఇంటికి పంపిస్తున్నారు.

24) – ఓడిపోతున్నానని తెలుసుకొని .. ఆ నెపాన్ని.. తన మోసపూరితమైన, అన్యాయమైన పాలన మీద రాకుండా.. ఈవీఎంల మీదో.. మరొకటో అని నేరాన్నివాటిపై నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు.

25) – చంద్రబాబు లాంటి దుర్మార్గుడు, రాక్షసుడు, నేరగాడు, అన్యాయస్థుడు.. ఎంత త్వరగా పోతే.. అంత త్వరగా రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *