హైదరాబాద్ లో ఇళ్ల అద్దెలు పెరుగుతున్నాయ్…ఎందుకో తెలుసా?

హైదరాబాద్ లో ఇళ్లకు బాగా డిమాండ్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతంలో ఇళ్ల  డిమాండ్ పెరిగి  అద్దెలు బాగా పెరిగాయి.
ఇది బెంగుళూరు చైన్నై లకంటే ఎక్కువగా ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
జాతీయంగా, అంతర్జాతీయంగా అర్థిక వాతావరణం అనుకూలంగా లేకున్నా హైదరాబాద్ వన్నెతగ్గలేదు. హైదరాబాద్ ఆకర్షణ చెక్కుచెదరడం లేదు.
అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది హైదరాబాద్ నగరంలో అద్దెలు 9 శాతంపెరిగాయని నిఫుణులు చెబుతున్నారు. ఈ విషయంలో బెంగుళూరు, చెన్నై ల మైక్రో మార్కెట్లకంటే హైదరాబాద్ చాలా ముందుంది.
ఈ రెండునగరాల లో అద్దెల పెరుగదల రేటు కేవలం 6 శాతమే.
హైదరాబాద్ నగరంలో వాణిజ్యం పెరుగుతూ ఉండటం, ఉద్యోగాల కోసం దేశంలోని అనేక ప్రాంతాలనుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఇళ్ల మీద డిమాండ్ పెరిగిందని రియల్టీ కన్సల్టెంట్లు చెబుతున్నారు.
హైదరాబాద్ లోని హౌటెక్ సిటి, నార్సింగి, బంజారా హిల్స్, బేగంపేట్, తేల్లాపూర్, నల్లగండ్ల,గోపన్ పల్లి వంటి ప్రాంతాలలో ఇళ్ల డిమాండ్ తీవ్రంగా ఉంది.
ఐటి హబ్ లకు సమీపంలో బాగా డవెలప్ అయిన మైక్రో మార్కెట్ లలో ఈ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ఇక్కడ అద్దెల పెరుగుదల రేంజ్ మూడు శాతం నుంచి 9 శాతం దాకా  పెరుగుతూ ఉందని ఎన్ రాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంతోష్ కుమార్ టైమ్సాఫ్ ఇండియా కు చెప్పారు.
ఐటి హబ్ సమీపంలోని కాలనీలలో 2BHK ఇల్లు (ఫ్లాట్) నెలసరి కనీస అద్దె రు 12 వేల నుంచి రు 25వేల దాకా ఉంది. దీనికి అపార్టమెంట్లు విధించే మెయింటెనెన్స్ చార్జెస్ అదనం.
చిన్న చిన్న ఫ్లాట్స్ కొరత వుండటం కూడా ఈ అద్దెపెరిగేందుకు కారణమని చెబుతున్నారు.
1200 ఎస్ ఎప్ టి ఉన్న 2BHK ఫ్లాట్ కు గత ఏడాది నెలకు రు. 18,000 అద్దె ఉంటే ఈ ఏడాది ఇది రు. 19,500 లకు చేరిందని బేగంపేటలోని ఒక రెసిడెన్సియల్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న మహేష్ కాంబ్లే (టెకీ) టిటిఎన్ కు చెప్పారు.