నా శాపంతోనే ఆ పోలీసాఫీసర్ చచ్చాడు: సాధ్వి ప్రజ్ఞా సింగ్ థాకూర్…

మధ్య ప్రదేశ్ భోపాల్ లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మీద బిజెపి మాలెగావ్ పేలుళ్ల కేసులో ముద్దాయి అని ప్రజ్ఞా సింగ్ థాకూర్ ను నిలబెట్టాలను కోవడమే వివాదానికి దారితీసింది. ఆమె ఈనెల 23 న నామినేషన్ వేస్తున్నారు.అయితే శుక్రవారం నాడు మరొక సంచలన ప్రకటన చేశారు.

భోపాల్ లో విలేకరులతో మాట్లాడుతూ ముంబై యాంటి టెర్రరిస్టు స్క్వాడ్  సభ్యడు హేమంత్ కర్కరే తన శాపం వల్లే సర్వనాశనమయ్యాయడని పేర్కొన్నారు.

2008 నవంబర్ లో ముంబైలోని పలు చోట్ల పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు బాంబు పేల్చి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టెర్రరిస్టు దాడిలోనే యాంటి టెర్రరిస్టు స్క్వాడ్ చీఫ్ గా కర్కరే కూడా చనిపోయారు. ఆయనకు 2009 లో మరణానంతరం అశోక చక్ర అవార్డు కూడా లభించింది.

అయితే, ఇపుడ సాధ్వి కర్కరే మరణ రహస్యం బయటపెట్టింది. ఆ ఏడాది సెప్టెంబర్ లో జరిగిన మాలె గావ్ పేలుళ్ల మీద కర్కరే దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ఉపయోగించిన మోటార్ సైకిల్ చివరకు పోలీసులను సాధ్వి వైపు తీసుకువచ్చింది. ఈ పేలుళ్లలో ఆరుగురు చనిపోయారు. వందమంది గాయపడ్డారు. దీనికి సంబంధించి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తన పాత్ర గురించి ఎలాంటి సాక్ష్యం లేకపోయినా తనని విడిచిపెట్టకుండా కర్కరే కస్టడీలోనే ఉంచాడని, ఇది ద్రోహమని, ధర్మవిరోధమని ఆమె వ్యాఖ్యానించారు. అపుడే తానే కర్కరేను, నువ్వు సర్వనాశనమయిపోవుగాక’ అని శపించానని అన్నారు. ఈ కేసులో ఆమె దాదాపు పదేళ్లు జైలులో ఉన్నారు. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజుడ్ క్రైం యాక్ట (MCOCA) కింద ఆమె మీద ఉన్న కేసులను పసంహరించుకున్నారు. అయితే, ఇతర నేరాల కింద మాత్రం విచారణ సాగుతూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *