ఢిల్లీ క్రికెట్ స్టేడియంకు జైట్లీ పేరు

దేశ రాజధాని న్యూఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు మార్చాలని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) నిర్ణయించింది.
శనివారం నాడు మృతి చెందిన కేంద్రమాజీమంత్రి అరుణ్‌ జైట్లీ స్టేడియంగా పేరు మారుస్తూ ఢిల్లీ క్రికెట్‌ సంఘం నిర్ణయించింది.
డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ 14ఏళ్లపాటు పనిచేశారు. జైట్లీ సేవలకు గుర్తింపుగా మైదానానికి ఆయన పేరు పెట్టారు. సెప్టెంబర్ 12న ఒక కార్యక్రమంలో ఈ పేరు మార్పడి జరుగుతుంది. ఇదే విధంగా మైదానంలోకి ఒక స్టాండ్ కు ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు పెడతారు.
మైదానం పేరు మార్పిడి విషయాన్ని డిడిసిఎ అధ్యక్షుడు వెల్లడించారు. జైట్లీ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే క్రికెటర్లు కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశీస్ నెహ్రా, రిషబ్ పంత్ తదితరులు భారత్ గర్వించే స్థాయికి ఎదిగారని ఆయన చెప్పారు.
జైట్లీ హయాంలోని స్టేడియం అధునిక మైదానంగా మారిందని శర్మ చెప్పారు.