మోదీ మీద మోదీ పోటీ , ఈ మోదీ ఎవరో తెలుసా?

ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి ఎవరు? మోదీ అనుకుంటున్నారా, కాదు.

ఆయన అచ్చుగుద్దినట్లు మోదీ లాగే ఉండే అభినందన్ పాథక్. వయసు 51, వూరు షహరాన్పూర్, ఉత్తరప్రదేశ్, వృత్తి పూజారి.

మొన్న మొన్నటి దాకా ప్రధాని నరేంద్రమోదీకి వీరాభిమాని.

తను మోదీలాగా ఉండటంతో, మోదీకి బాగా పనికొస్తుందని 2014 ఎన్నికల్లో మోదీతరఫున విపరీతంగా ప్రచారం చేశారు.మోదీలాంటి మోదీని చూసేందుకు జనం విరగబడి వచ్చారు.

2014 వారణాసి ఎన్నికల్లో అభినందన్ పాథక్ ప్రత్యేకాకర్షణగా నిలిచారు. మోదీకి కార్బన్ కాపీలాగాఉండటంతో అపుడాయన రాత్రికి రాత్రి సెలెబ్రిటీ అయి కూర్చుున్నారు. ఆ ఎన్నికల్లో మోదీ గెలవడం , ప్రధాని కావడంతో పాథక్ స్టేటస్ కూడా పెరిగింది. బాగా గుర్తింపు వచ్చింది. వారణాసిలో ఆయన్నెవరైనా గుర్తుపడతారు. పల్కరిస్తారు. ఆయన తో మాట్లాడేందుకు ఇష్టపడతారు. రోడ్డు మీది జనం ఆయన కనపడితే చాలు, టీ ఆఫర్ చేస్తారు. కర్రకారయితే, సెల్ఫీ తీసుకోకుండా వదిలే వారు కాదు.

అయితే, ఇపుడాయనకు చిక్కు సమస్య వచ్చిందని చెబుతున్నారు.
డీమానెటైజేషన్ తో ఈ చిక్కులొచ్చాయని ఆయన అంటున్నారు. డిమానేటైజేషన్తో కష్టాలొచ్చినవాళ్లంతా తనను శత్రువులాగా చూస్తున్నారనిఆయన వాపోతున్నారు.మోదీని ఏమనలేక నన్ను నామాటలంటున్నారు, నేనిపుడు మోదీ బాధితుడిని అని బాధపడుతున్నారు. కేవలం మోదీలాగా ఉన్నానని నన్ను కొట్టిన సందర్భాలుగా కూడా ఉన్నాయని అయన చెబుతున్నారు.

ఇక లాభం లేదనుకుని పాథక్ పార్టీ మార్చేశారు. డీమానెటైజేషన్ వల్ల నష్టం అట్టడుగుప్రజలకు నష్టం జరిగిందని తెలుపుకుని ఆయన కాంగ్రెస్ లో చేరారు. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశాను. తను ప్రచారం చేస్తే గెలుపే. ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

అయితే, కాంగ్రెస్ తో కూడా నిరాశకు లోనయ్యారు. తన ప్రచారం చూశాక ఈ ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం ఇస్తుందనుకున్నారు, ఇవ్వలే. రాహుల్ గాంధీ అన్నా, ఆయన విధానాలన్నా అభిమానం ఉన్నా ఆయన కాంగ్రెస్ లో ఉండలేక బయటకు వచ్చారు.

అభినందన్ పాథక్ లక్నోలో ఉంటాడు. జీవనం కోసం ఒక గుడిలో పూజారిగా ఉంటాడు.

ఈసారి ఎవరితరఫున ప్రచారం చేయకుండా తానే నిలబడాలనుకున్నాడు. ఎవరి నీడలాగో బతకినందుకు సిగ్గుపడుతున్నానంటున్నారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా వారణాసిలో ప్రధాని మీద నిలబడ్డాడు. అంతేకాదు, లక్నో నుంచి బిజెపి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మీద కూడా పోటీ చేస్తున్నారు.

నామినేషన్లు వేసేందుకు అవసరమయిన సెక్యూరిటీ డిపాజిట్ ను జనం నుంచి సేకరించాడు.‘ నేను ప్రతిఓటరు నుంచి ఒక రుపాయ, ఒక ఓటు అడుగుతున్నా.దీనికి మంచి స్పందన ఉంది,’ అని హుశారుగా చెప్పాడు.
ఎన్నికల అఫిడవిట్ లో తన స్థిరాస్తులేవీ లేవని, రు. 50 వేల బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం ఉందని చెప్పారు. ఇవన్నీ చూసి పాథక్ ని కమేడియన్ లాగాచూడకండి. ఆయన బాగా చదువుకున్నావాడే అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మే పూర్తి చేశారు.

పాథక్ ఎన్నికలు కొత్త కాదు. ఇంతవరకు ఆయన నాలుగు సార్లు పోటీ చేశారు. రెండు సార్లు షహరాన్ పూర్ మునిసిపల్ కార్పరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీచేశారు. తర్వాత 1999, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పో టీ చేశారు. ఆ పైన 2017 వారణాశి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేశారు. సరిగ్గా లేదని దానిని ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

ఇది కూడా చదవండిః

 

ఉన్న సంఘాలను చీల్చి అన్ని సంఘాలెందుకని ప్రశ్నించడం హాస్యాస్పదం

https://trendingtelugunews.com/teachers-to-stage-protest-o…/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *