వయనాడ్ లో రాహుల్ మీద ఎన్ డి ఎ అభ్యర్థి ఈయనే…

(ఎన్ సంజీవ్ కుమార్)

భారత దేశంలో అత్యంత ప్రగతి శీల కుల సమీకరణ ఉద్యమంగా వచ్చిన శ్రీ నారాయణ ధర్మ పరిపానలయోగం(ఎస్ ఎన్ డి పి) కి అనుబంధ సంస్థగా వచ్చిన భారత ధర్మ జనసేన( బిడిజెఎస్) నాయకుడు తుషార్ వేల్లపల్లి ని కేరళ లోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ మీద పోటీ పెట్టాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈవిషయాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు.

అక్కడ కేరళ బిజెపి అధ్యక్షుడు శ్రీధరన్ ని లేదా కేంద్ర మంత్రి స్మృతిఇరానీని నిలబెట్టాలని ఒక దశలో భావించారు. అయితే, బిడిజెస్ నేతయే సరయినవాడని చివరకు ఆయన పేరును ఖరారుచేశారు.

శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం బ్రాహ్మణుల కు వ్యతిరేకంగా కేరళలో వచ్చిన గొప్ప ఉద్యమం. కేరళ లో బాగా వెనకబడిన కులం ఇళావా ( తెలుగు రాష్ట్రాలలో ఈడిగ )ప్రజల కోసం వందేళ్ల కిందట వచ్చిన ఉద్యమం.నారాయణ గురు (ఆగస్టు 28,1855-సెప్టెంబర్ 20,1928) దీని సంస్థాపకుడు.కులనిర్మూలన ఆయన ప్రతిపాదించారు. ఆ రోజుల్లో ఈ కులం వాళ్ళని అంటరాని వారుగా చూసే వారు. నంబూద్రి బ్రాహ్మణుల దరిదాపుల్లోకి కూడా వెళ్లేందుకు వీళ్లకి అనుమతి లేదు. హిందూ ఆలయాలలోకి వారి ప్రవేశం లేదు. హిందువులు వాడే బావులనుంచి వారు నీరు తోడుకోవడానికి, అక్కడ స్థానం చేసేందుకు గాని వీరికి అనుమతి లేదు. కల్లు గీత వృత్తినీచమయినదిగా చూసే వారు. ఈనేపథ్యంలో నారాయణ గురు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా శ్రీనారాయణ ధర్మపరిపాలనయోగం (SNDP)ని స్థాపించారు.

అనతి కాలంలోనే ఆయన బోధనలు ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చాయి. దేవాలయాలను నిర్మించడం,బ్రాహ్మణులు అవసరం లేకుడా అక్కడ పూజలు చేయడం జరిగేది. ఇది ఒక విధంగా బ్రాహ్మణలకు వ్యతిరేకంగా వచ్చిన ఆత్మ గౌరవ ఉద్యమం. అందుకే బ్రాహ్మణుల అవసరంల లేని వ్యవస్థను సృష్టించుకున్నారు. వాళ్లు గుడులు కట్టుకున్నారు, పుజారులను నియమించుకున్నారు. వాళ్ల మంత్రాలు వాళ్లు రూపొందించుకున్నారు. ఆశ్రమాలు, మఠాలు ఏర్పాటుచేసుకున్నారు.

ఇలాంటి ఎస్ ఎన్ డి పి స్థాపించిన రాజకీయ సంస్థయే భారత్ ధర్మ జన సేన . SNDP కి తుషార్ ఉపాధ్యక్సుడు. తుషార్ బిజెపి తో పొత్తు పెట్టుకోడం, సంస్థ ఐడియాలజీ, చరిత్రను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే, ఆయన తండ్రి వేల్ల పల్లి నటేశన్ (ఎస్ ఎన్ డి పి అధ్యక్షుడు) వామపక్షంతో ఉంటున్నారు.

వేల్ల పల్లి తుషార్ నువేనాడ్ ఎన్ డిఎ అభ్యర్థిగా ప్రకటిస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఆయన చాలా చరుకైన, మెరుగయిన యువనాయకుడు. అంకిత భావానికి, సామాజిక న్యాయానికి ఆయన ప్రతీక. ఆయనతో కేరళలో ఎన్డీయే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదురుగుతంది,’ అని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

తన అభ్యర్థిత్వం గురించి హర్షం వ్యక్తం చేస్తూ తాను రాహుల్ కు గట్టి పోటీ ఇస్తున్నానని తుషార్ ప్రకటించారు. వయనాడ్ లో ప్రధాని ఎన్ డిఎ , రాహుల్ మధ్యే ఉంటుందని, ఇక్కడ వామపక్షాలు ఉనికి నామ మాత్రమేనని ఆయన చెప్పారు.

తుపార్ వయసు 49 సంవత్సరాలు. ఎంబిఎ దాకా చదువుకున్నారు. ప్రస్తుతం హోటల్ వ్యాపారంలో ఉన్నారు.

బిడిజెఎస్ 2016 లో ఏర్పాటయింది. 2016 ఎన్నికల్లో 36 నియోజకవర్గాలలో ఈ పార్టీ పోటీ చేసింది. అయితే, ఒక్క చోట కూడా ఈ పార్టీ గెలుపొందలేదు. పార్టీకి వచ్చిన వోట్ షేర్ 4 శాతమే. బిజెపి కి వచ్చింది 10.6 శాతం.
వయనాడ్ లో లెఫ్ట్ ఫ్రంట్ సిపిఐ నాయకుడు, మాలప్పురం జిల్లా కార్యదర్శి పిపి సునీర్ అభ్యర్థిగా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *