ఎన్నికల కమిషన్ లో చీలిక

ఎన్నికల కమిషన్  ప్రధాని మోదీకి, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నదని విమర్శలు వస్తున్నసమయంలో, ఇలాంటి అనుమానానికి బలం చేకూరుస్తూ సభ్యుడు అశోక్ లావాసా కమిషన్ తీరు మీద నిరసన వ్యక్తం చేశారు.

ప్రధాని ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారా లేదా అనే దాని మీద  ముగ్గురు సభ్యలు కమిషన్ లో  విబేధాలు ముదిరాయి. కోడ్ ఉల్లంఘన మీద ఎవరిమీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద విబేధాలు రావడంతో దాదాపు కమిషన్ లో చీలిక వచ్చింది.

ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్ ని ఉల్లంఘిస్తున్నారని వస్తున్న ఆరోపణల మీద చర్యలుతీసుకోవడంలో కమిషన్ లో ఏకాభిప్రాయం రావడం లేదు.

దీనితో ఒక ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాకు ఎన్నికల కమిషన్ ఛీఫ్ సునీల్ ఆరోరా, మూడో సభ్యులు సుశీల్ కుమార్ మధ్య విబేధాలు తీవ్ర మయ్యాయి.

ఫలితంగా ఇక ముందు కోడ్ మీద జరిగే సమావేశాలకు వెళ్లరాదని లావాసా నిర్ణయయించుకున్నారు.

కోడ్ ఉల్లంఘన మీద జరిగే సమావేశాలలో తన మైనారిటీ ఒపినియన్ ను రికార్డు చేయనందున నిరసనగా తాను సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఈ మేరకు అశోక్ లావాసా ఎన్నికల కమిషన్ చీఫ్ సునీల్ అరోరాకు లేఖ రాసినట్లు వార్త లొస్తున్నాయి. ఎన్నికల కోడ్ మీద జరుగుతున్న సమావేశాలకు ఆయన ఈ నెలారంభం నుంచి హాజరుకావడం లేదు.

ఎన్నికల కోడ్ సమావేశాలలో తన మైనారిటీ అభిప్రాయాన్ని రికార్డు చేయడమే కాదు, కమిషన్ ఉత్తర్వులలో మైనారిటీ నిర్ణయాన్ని కూడా రాయాలని పట్టుబడుతున్నారు.

ఇప్పటికే ప్రధాన మంత్రి మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఉపన్యాసాలకు కమిషన్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని లావాసా వ్యతిరేకించారు. తన నిరసన రాతపూర్వకంగా సమర్పించారు.

ఎన్నికల కమిషన్ ఈ ఉపన్యాసాల మీద 2:1తీర్పునిస్తూ ప్రధాని మోదీగాని, అమిత్ షా గాని ఎన్నికల కోడ్ ుల్లంఘించలేదని చెప్పారు. ఏప్రిల్ 21, గుజరాత్ లోని పటాన్ లో మాట్లాడుతూ పాకిస్తాన్ గుండెళ్లో రైళ్లు పరిగెత్తించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ను అభినందర్ వర్థమాన్ ను విడిపించుకువచ్చామని ప్రకటించారు. అయితే ఇది కోడ్ ను ఉల్లంఘించడం కాదని మే 4 కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇది కమిషన్ మోదీకి ఆరో క్లీన్ చిట్.
తర్వాత, ముస్లిం పెద్ద సంఖ్యలో ఉన్నందునే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారి ప్రధాని మోదీ చేసిన ఆరోపణ లో కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనేమీ లేదని కమిషన్ ఏప్రిల్ ఒకటో తేదీన చెప్పింది.

మహారాష్ట్రలాతూర్లో మట్లాడుతూ మొదటి సారి వోటేస్తున్న భారతీయులంతా తమ వోటును పుల్వామా అమరవీరులకు అంకితమీయాలని కూడా ప్రధాని పిలుపునిచ్చారు. ఇందులో ఎన్నికల నియమావళి ఉల్లంఘనేమీ లేదని కమిషన్ చెప్పింది.వీటన్నింటి మీద అశోక్ లావాసా వేరే అభిప్రాయాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *