వ్యవస్థ మీద కసితో IAS అయిన స్కూల్ డ్రాపవుట్

తమిళనాడు కు చెందిన ఈలంబాహవత్ కు వ్యవస్థ మీద చాలా కోపం వచ్చింది. ఇక ఉద్యోగం రాదన్న నిస్పృహ ఆవహించింది. ఎందుకంటే, ప్రభుత్వం ఉద్యోగం వచ్చే ఒకే ఒక్క అవకాశం నెరవేరకుండా పోతూ ఉంది. ఈ ఉద్యోగం రాకపోతే, ఇక జీవితంలో ప్రభుత్వోద్యోగి కాలేడు. పల్లెటూర్లో వ్యవసాయం చేసుకుంటూ చాలీచాలని రాబడితో బతుకు వెళ్ల దీయాల్సిందే.
ఈలంబాహవత్ జీవితంలో చక్కటి తెలుగుసినిమా లాగా ఉంటుంది.
ఇంతకు ఈలంబాహవత్ సమస్య ఏమిటో తెలుసా?
ఈలంబాహవత్ మనంలో చాలా మంది లాగే పల్లె టూరి పిల్లగాడు. 1982లో తమిళనాడు, తంజావూరు జిల్లాలోని చోలగంగుడికాడు గ్రామంలో జన్మించాడు. పెద్ద కుటుంబమేమీ కాదు. వాళ్లయ్య విఎవొ గా పనిచేశేవాడు.తల్లి వ్యవసాయ పనులు చేసేది. కాబట్టి మిగతా వాళ్ల కంటే కొద్దిగా మెరుగు.అందువల్ల స్కూల్లో చేరగలిగాడు. అయితే, తీరిక ఉన్నపుడల్లా పొలంలో తల్లికి తోడు గా పని చేసే పక్క పల్లెటూరోడు. స్నేహితుల్తో కలసి అడుకోవడం తప్ప అతనికి మరొక వ్యాపకం తెలియదు. జీవితం గురించి పెద్ద కలలు లేవు.
ఎందుకంటే, వాళ్లయ్య అమ్మ కూడా మనోడిని ఎమ్ సెట్ చదివించి డాక్టర్నో, ఇంజనీర్నో చేసి అమెరికా పంపించాలనే కలలేమీ కనలేదు. అయితే, కుటుంబం చదువుకు చాలా ప్రాముఖ్యం ఇచ్చింది కాబట్టి మనవాడు స్కూల్లో చేరిపోయాడు. అయితే, సినిమా కథలో లాగా నే విధి వక్రీకరించింది.
1997లో తండ్రి చనిపోవడం మనహీరో కష్టాల్లో పడ్డాడు. అపుడింకా ఆయన 12 వ తరగతిలోనే ఉన్నాడు. అంతకు మంచి చదవు కొనసాగించడం కష్టం. కంపాసెనేట్ గ్రౌండ్ కింద ప్రభుత్వోద్యోగం వస్తే చాలా ఇక చదవాల్సిన కష్టముండదు, తాలూకా ఫీసులో ఎల్ డి సి ఉద్యోగం వస్తే చాలు పొలాల ముళ్లబాట నుంచి బయటపడవచ్చని అనుకున్నాడు. తండ్రి సర్వీసులో ఉండిచనిపోయిందు తనకు ఎల్ డి సి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు.
దీనికి అవసరమయిన సర్టిఫికేట్ లు జత చేసి జిల్లాకలెక్టరా ఫీసులో దరఖాస్తు అందించాడు. ఈ ఉద్యోగానికి దాదాపు 20 రకాల సర్టిఫికెట్లను ఈలంబాహవత్ జత చేయాల్సి ఉంటుంది. ఇందులో తన చేతనయిన కాడికి సర్టిపికేట్లు సంపాదించి ఇచ్చాడు, ఇక ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అయితే, ఉద్యోగం రాలే.
ఏవో సమస్యలు చెప్పి జిల్లా కలెక్టారఫీసు వాళ్లు ఉద్యోగం ఇవ్వలేక పోతున్నామని చావు కబురు చల్లగా చెప్పారు. అపుడు ఈలంబాహవత్ తో పాటు 15 మంది అభ్యర్థులు ఇలాంటి ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్లను బైపాస్ చేసి కొంతమంది ఉద్యోగాలు తెచ్చుకోలిగారు. ఇదెలా సాధ్యమో అప్పటి ఈలంబాహవత్ కు అర్థమయి చావలేదు.
చేయగలిగిందంతా ఇతర అభ్యర్థులతో కలసి తమ కూ న్యాయం చేయండి జిల్లా కలెక్టర్కు, రెవిన్యూ సెక్రెటరీకీ, ఇతర సీనియర్ అధికారులకు, చివరన చీఫ్ మినిష్టర్ పిటిషన్ పెట్టడానికి మించి ఆయనేం చేయలేదు.
ఈ పనులు అయిపోయాయి. ఉద్యోగం రాలేదు. ఇపుడేం చేయాలి? అలా అందరికాళ్ల వేళ్లా పడకుండా ఉద్యోగం తెచ్యచుకోవడమెలా అని ఆలోచించాడు… తానుచూసిన అవ్యవస్థ మీద రోత పుట్టింది. కసి పెరిగింది. ఈ అధ్వాన్నంగా వ్యవస్థలో అస్సలిది మార్గం కాదు. అసలు మనమే కలెక్టారాఫీసులో కూర్చుంటే, తన లాంటివాళ్లెందరికో సాయం చేయవచ్చని అనుకున్నాడు. కలెక్టర్ చేతిలో చాలా అధికారాలుంటాయని, వాటితో తన లాగా కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకోవచ్చనుకున్నాడు. ఇలా వ్యవస్థ మీద పగ తీర్చుకోవాలనుకున్న పట్టుదల నుంచి ఈలంబాహవత్ కు కలెక్టర్ కావాలన్న ఆలోచన వచ్చింది.

“To run my family, I had to work. I applied for a job under compassionate ground as Junior Assistant (LDC) and submitted my educational certificates to the District collector office. I had to discontinue my graduation.

I ran from pillar to post 20 certificates needed for this posting. But, I couldn’t get the job. And other people were also facing this. So We thought that, if we bring our problems to the notice of senior officers, they will redress our genuine grievance.

We petitioned the collector.
We petitioned the Commissioner.
We petitioned the Revenue secretary.
We petitioned the Chief Secretary.
We petitioned the Chief Minister.

Nothing happened!
Nothing happened for 9 years!

Why weren’t our voices heard?
Why did our genuine grievance not attract the attention of the senior officers?

What’s the solution for those who spoilt their academics because of this ordeal?
No answers!

One day, I thought, I should not ask job by compassion. I should get it by my competence.” Humans of LBSNAA

తానేమో స్కూల్ డ్రాప్ అవుట్, కలెక్టర్ కావడం సాధ్యమా… సాధ్యం చేయాలనుకున్నాడు. రెగ్యులర్ కాలేజీలో డిగ్రీ చేయడానికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదుకాబట్టి, ప్రయివేటుగా అంటే డిస్టెన్స్ ఎజుకేషన్ లో మద్రాసు విశ్వవిద్యాలయంలో బిఎ డిగ్రీ కట్టాడు.పాసయ్యాడు.
సివిల్స్ రాసేందుకు అర్హత వచ్చింది. కోచింగ్ కు వెళ్లే ఆర్థిక వనరుల్లేవు. దానికి తోడు ఆయనకి దగ్గర్లో కోచింగ్ సెంటర్లు కూడా లేవాయే. అంతే ఆయన పబ్లిక్ లేబ్రరీని తన ప్రిపరేషన్ కు ఎంచుకున్నాడు. లకీగా అందులో సివిల్ సర్వీస్ ప్రిపేరయ్యే వారికోసం ఒక ప్రత్యేక విభాగం ఉంది.
ఆయనకు గైడెన్స్ ఇచ్చేది పరిచయమున్న ఒక రిటైర్డు హెడ్ మాస్టర్ ఎ.టి పన్నీర్. పుత్తుకోటై లో ఉండే తనలాంటి మరొక పది మంది పోగేసుకుని ఈలంబాహవత్ చవడం ప్రారంభించాడు. ఇలా ప్రిపేర్ కావడంతో తమిళనాడుప్రభుత్వం ఇచ్చు ఉచిత సివిల్స్ కోచింగ్ కు సులభంగా ఎంపికయ్యాడు. అయితే, ఈలంబాహవత్ కు మొదట బాగా నిరాశ ఎదురయింది.
తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలెన్నో పాసయినా, సివిల్స్ లో మొదటి మూడుసార్లు రాసిన పరీక్షల్లో ఈలంబాహవత్ ఫెయిలయ్యాడు.
అయితే, ఆయన పట్టుదల పట్టు సడల్లేదు. గ్రూప్ వన్ సర్వీస్ లో చేరి , ప్రిపరేషన్ మళ్లీ ప్రారంభించాడు. ఈసారి ఆయన ప్రభుత్వంలోని సీనియర్ అధిరారులు కూడా సలహా లిచ్చారు. 2014 లో కేంద్ర ప్రభుత్వం సివిల్ సర్వీస్ అప్టిట్యూడ్ టెస్ట్ లో ఇబ్బందు పడ్డారని మరో రెండు దఫాలు పరీక్ష రాసేందుకు అనుమతినిచ్చింది. దీనితో ఈలంబాహవత్ రెండు సార్లు పరీక్ష రాసేందుకు అవకాశమొచ్చింది.
మొదటి దఫా ఐఆర్ ఎస్ కు ఎంపికయ్యారు. రెండో దఫా,2015లో చివరి దఫా పరీక్ష రాసి ఐఎఎస్ కు సెలెక్టయ్యారు. అఖిల భారత స్థాయిలో 117వ ర్యాంకు వచ్చింది. తమిళనాడు క్యాడర్ లభించింది. కథ అలా శుభం అని ముగిసింది.

మొదట వేలూరు జిల్లా రాణిపేట సబ్ కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది. ప్రజలకు ప్రభుత్వాధికారులు సేవలందించే పద్ధతులు మారాలన్నదే తన ఆశయమని ఈలంబాహవత్ చెబుతున్నారు.

ఆయన తన కథను Humans of LBSNAA లో వివరంగా రాశారు.

(ఈ సక్సెస్ స్టోరీ ఇన్ స్పైరింగ్ గా ఉంటే మీ మిత్రులందరికి షేర్ చేయండి. trendingtelugunews.com కు మద్దుతునీయండి)