లక్ష్మణ రేఖ దాటారు, కెసిఆర్ కు ఎన్నిలక కమిషన్ నోటీసు

 హిందువులను కించపరిచే విధంగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడనే అరోపణ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఎన్నికల సంఘం నోటీసు జారీచేసింది.
 కరీంనగర్ ఎన్నిలక సభలో ప్రసంగిస్తున్నపుడు ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రసంగించారన్నది ఆరోపణ.
ఇందులో ప్రాథమిక సాక్ష్యాలున్నాయని చెబుతూ ఏప్రిల్ 12 సాయంకాలం లోపు నోటీసు జవాబీయాలని కమిషన్ ఆదేశించింది.
అలాకాని పక్షంలో పునరాలోచించకుండా కమిషన్ తన నిర్ణయం తీసుకుంటుందని కూడా కమిషన్ నోటీసులో పేర్కొంది.
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు కమిషన్ ఈ నోటీసు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడయిన కెచంద్రశేఖర్ రావు మార్చి 17 వ తేదీన కరీంనగర్ లో  ఒక ఎన్నికల సభలో ప్రసగిస్తూ హిందువులను కించపరిచే విధంగా మాట్లాడి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేశారని రామరాజు ఫిర్యాదు లో పేర్కొన్నట్లు కమిషన్ తెలిపింది.
కెసిఆర్ మాట్లాడిన విషయాలను కమిషన్ తెలుగులో సమర్పించింది కూడా. అయితే వాటి ఇంగ్లీష్ అనువాదం అందించలేదు. ‘ఈ హిందూ గాళ్ళు, బొందు గాళ్లు, దిక్కుమాలిన …దరిద్రపు గాళ్ళు’ అనే మాటలు వాడినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు.
కమిషన్ ప్రాథమికంగా,  సాంఘిక మత సమూహాల మధ్య సామరస్యం దెబ్బతీసి,  ఇపుడున్న విబేధాలను తీవ్రం చేసే శక్తి కెసిఆర్ చేసిన వ్యాఖ్యాలకు ఉందని కమిషన్ నమ్ముతూ ఉందని నోటీసులో పేర్కొన్నారు. దీనితో ముఖ్యమంత్రి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కూడా నోటీసులో  పేర్కొన్నారు.
 “… the Commission is, prima facie, of the opinion that by making the aforesaid statement which has the potential of disturbing harmony and aggravating existing differences between social and religious communities, and appealing to communal feelings, you have violated the … the Model Code of Conduct,” అని మంగళవారంనాడు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.
ఏ పార్టీ గాని, అభ్యర్థిగాని సామాజిక, భాషాపర, మత పర వర్గాల మధ్య ఇపుడున్న విబేధాలను తీవ్రం చేసి, పరస్పర వైషమ్యాలను సృష్టించి ఉద్రికత్తను పెంచే విధంగా ప్రవర్తించరాదన్న నియమాన్ని కూడా కమిషన్ కెసిఆర్ దృష్టికి తెచ్చింది.
ఎన్నికల నియమావళి మార్చి 10 అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇలాంటి ఉపన్యాసాలు చేయడం మీద నిషేధం అమలులో ఉంది..
ఇది కూడా చదవండి

ఫ్లాష్.. ఫ్లాష్..

https://trendingtelugunews.com/tragedy-in-telangana-narayanapeta-dist/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *