కుక్క చిచ్చు, ఆడవాళ్లను ఎలా కొట్టిండో చూడండి (వీడియో)

కుక్క పెట్టిన చిచ్చు రెండు కుటుంబాల్లో అశాంతిని రేపింది. కుక్క యజమాని ఇంగితం మరచిపోయి ఆడవాళ్ల మీద ఎగబడి ఎగబడి కొట్టిండు. పూర్తి వివరాలు, వీడియో కింద ఉన్నాయి చదవండి చూడండి.

పెద్దపల్లి జిల్లాలో ఒక కుక్క వల్ల రెండు కుటుంబాల వాళ్లు రోడ్ల మీద పొర్లిచ్చి పొర్లిచ్చి కొట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సందీప్ కుక్కను సాదుకుంటున్నాడు. అయితే ఆ కుక్క పక్కింటి ముందు ప్రతిరోజు బహిర్భూమికి వెళ్తున్నది. ఆ కుక్కను కంట్రోల్ చేయాలని ఆ పక్కింటి వాళ్లు చెబుతున్నారు. అయినా ఆ కుక్కను మాత్రం సందీప్ కంట్రోల్ చేయకుండా అలాగే ఉన్నాడు.

కుక్కను అదుపులో ఉంచుకోకుండా తమ ఇంటిని గలీజ్ చేసేసరికి వారికి కోపమొచ్చింది. ఈ విషయమై సందీప్ ను వారు గట్టిగా నిలదీశారు. దీంతో తననే నిలదీస్తారా అంటూ సందీప్ సదరు పక్కింటి మహిళల మీద ఎగబడి కొట్టాడు. మహిళలు అని కూడా చూడకుండా పొర్లిచ్చి పొర్లిచ్చి కొట్టాడు. విచక్షణ కోల్పోయిన సందీప్ ను ఎంతమంది వచ్చి ఆగబట్టినా ఆగలేదు.

తమపై దాడిచేసిన సందీప్ మీద మహిళలు పోలీసు కేసు పెట్టారు. రంగంలోకి దిగిన సందీప్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్న సంగతి ఏమో కానీ… కుక్కను పెంచుకుని మందిమీద దాడులు చేసే నీచాతి నీచమైన సందీప్ లాంటివాళ్లకు మాత్రం గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. కింద సందీప్ దాడి వీడియో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *