స్త్రీ నిధి ఎండీ పై సెర్ప్ ఉద్యోగులు గరం గరం

తెలంగాణలో గత రెండు వారాలుగా సెర్ప్ ఉద్యోగులు రగిలిపోతున్నారు. సెర్ప్ లో అంతర్భాగమైన స్త్రీ నిధి సంస్థ ఎండీ విద్యాసాగర్ రెడ్డి మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఎండీ ని వెంటనే ఉద్యోగంలోంచి తీసేయాలి డిమాండ్ చేస్తున్నారు.
స్త్రీ నిధి ఎండిగా ఉన్న విద్యాసాగర్ రెడ్డి సంస్థ ప్రయోజనాలకు భిన్నంగా పని చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎండీని పదవి నుండి తొలగించి స్త్రీ నిధి బాధ్యతలు పూర్తిగా సెర్ప్ సీఈఓ పరిధిలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. సెర్ప్ ఉద్యోగుల జాక్ రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట సాగిస్తోంది. దీనికి సంబంధించి సెర్ప్ జేఏసీ నేతలు శుక్రవారం విడుదల ప్రకటన వివరాలు కింద చదవండి.
3వేల కోట్ల రుపాటల నిధి ఉన్న
స్త్రీనిధి లో 10సం. లుగా పాతుకుపోయిన విద్యాసాగర్ రెడ్డిని ఎండీ పోస్టు నుండి తొలగించాలి.
ఎండీ పోస్టు ను సెర్ప్ సీఈఓ కు అప్పగించాలని సెర్ప్ జాక్ డిమాండ్ చేస్తున్నది.
మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. స్త్రీనిధి ఎండిగా విద్యాసాగర్ రెడ్డి రెనివల్ కు వ్యతిరేకమని వెల్లడిస్తున్నాము.
ఎండిని తీసేయాలని ఇప్పటికే 85% మండల మహిళా సమాఖ్య లు తీర్మానం చేశాయి.
అన్ని తీర్మానం కాపీలను సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇస్తున్నాము.
అందుకే రేనేవల్ ఆపాలని డిమాండ్ చేస్తున్నాము.

రిటైర్మెంట్ తర్వాత ఉపాధి కల్పించిన స్త్రీనిధి రూపకల్పన చేసిన
మాతృ సంస్థ సెర్ప్ పై ఎప్పుడూ తప్పుడు ప్రచారం చేసే విద్యాసాగర్ రెడ్డి తన రినెవల్ కోసం ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.
ఎండి మాయమాటలు, తప్పుడు నివేదికను పట్టించుకోకుండా
3వేల కోట్ల రూపాయల స్త్రీనిధి సంస్థ కు బాధ్యత కలిగిన ఐఏఎస్ అధికారిణి, సెర్ప్ సీఈఓ పరిధిలోకి తీసుకురావాలని కోరారు.
స్త్రీనిధి ని సెర్ప్ పరిధిలోకి కొనసాగించాలని, ఎండిగా విద్యాసాగర్ రెడ్డి రినెవల్ ఆపకపోతే క్షేత్ర స్థాయిలో మండల మహిళా సంఘాల తీర్మానం, సిబ్బంది ఒత్తిడి మేరకు 5000 మంది సిబ్బంది, 5000 మంది మహిళలు కలిపి 10000 మంది తో చలో హైదరాబాద్ చేపడతామని జేఏసీ నాయకులు గంగాధర్ రెడ్డి, నర్సయ్య, సుభాష్, జానయ్య హెచ్చరించారు.