పంటల బీమా రైతుకు నరకం చూపిస్తున్నది: బొజ్జా ధశరథ్

(యనమల నాగిరెడ్డి)

భారతదేశంలో వ్యవస్థలేవీ రైతుకు అనుకూలంగా లేవని,దీనితో రైతాంగం, వ్యవసాయం చితికిపోతున్నాయని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథరామి రెడ్డి అభిప్రాయపడ్డారు.

  నెల 2 నుంచి  5 వ తేదీ వరకు ఫిలిప్పీన్స్ రాజధాని  మనీలాలో జరిగిన ‘ఆసియా ప్రాంత రైతాంగ సమస్యలు -పరిష్కార మార్గాలు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

భారతదేశంలో వ్యవసాయదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సదస్సులో పాల్గొన్న పరిశోధనా సంస్థలు, శాస్త్రజ్ఞులు, మేధావులు, విత్తన, మందుల కంపెనీలు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయం  రంగం పై ప్రభుత్వం అనుసరిస్తున్నవి విధానాలు   అసమగ్రంగా ఉన్నాయంటూ పేరుకు గొప్పదిగా కనిపించే భీమా పథకం లోపాల గురించి ఆయన సదస్సు దృష్టికి తీసుకువచ్చారు.

పంటల భీమా పథకం చెప్పడానికి వీలుకానంత లోపభూయిష్టంగా ఉందని ఆయన  పేర్కొన్నారు.

 పంటలు భీమా చేయడం నుంచి పంట నష్టం అంచనావేయడం వరకు భీమా కంపెనీలు పూర్తిగా అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నాయని, భీమా చెల్లింపుల్లో కంపెనీలు రైతులకు నరకం చూపిస్తున్నాయని ఆయన తన పత్రంలో వివరించారు.

విధానాలు, తగినన్ని పరిశోధన సంస్థలు లేకపోవడం, పరిశోధనా ఫలితాలు రైతులకు సక్రమంగా అందక పోవడం, సకాలంలో పెట్టుబడులు, ఎరువులు, మందులు అందకపోవడం, నీటివసతి లేకపోవడం లాంటి అనేక కారణాల వల్ల భారత దేశంలో వ్యవసాయ రంగం  పై ఆధారపడిన రైతులు అనేక ఎదుర్కోవలసి వస్తున్నదని, అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథరామి రెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతానికి దేశంలో నీటిపారుదల రంగంపై ప్రభుత్వం ద్రుష్టి పెట్టడంలేదని, నీటిపారుదల రంగంపై శాస్త్రీయ దృక్పధంతో  కూడిన సమగ్ర విధానం అమలు చేయాల్సి ఉందని ఆయన  పేర్కొన్నారు.

ఇందుకోసం ఆసియా స్థాయి వ్యవస్థలు వత్తిడి తేవాలని కోరారు.

వ్యవసాయ ఉతత్పత్తులపై నిలకడలేని ప్రభుత్వ ఎగుమతి -దిగుమతి విధానాలు, పంటల ధరల నిర్ణయంలో ప్రభుత్వ అనుచిత జోక్యం, మార్కెటింగ్ సౌకర్యం లేక పోవడం, సమయానికి లభించని నాణ్యమైన ఎరువులు-పురుగు మందులు, తగినంత పెట్టుబడి లభించక పోవడం, పరిశోధనలకు తగినంత  లేకపోవడం, పరిశోధనా ఫలితాలు అందుకే పోవడం, ప్రభుత్వ పరంగా విజ్ఞాన విస్తరణ వ్యవస్థ లేకపోవడం లాంటి అనేక అంశాలు రైతులను కృంగదీస్తున్నాయని ఆయన తన పత్రంలో పేర్కొన్నారు.

భారత్ లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆసియా వ్యవసాయ సమాజం సహకరించాలని, ప్రభుత్వాలపై వత్తిడి తేవాలని ఆయన సదస్యులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *