నల్లగొండ సిపిఎం అభ్యర్ధి మల్లు లక్ష్మిపై పాట

సీపీఎం పార్టీ నుంచి నల్లగొండ పార్లమెంటు అభ్యర్ధిగా మల్లు లక్ష్మీ పోటి చేస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధురాలు, సీపీఎం కేంద్ర కమిటి సభ్యురాలు మల్లు స్వరాజ్యం చిన్న కోడలు మల్లు లక్ష్మీ. మహిళల సమస్యల పై ఆమె అనేక పోరాటాలు చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు.

నల్లగొండలో మల్లు లక్ష్మీ గెలుపే లక్ష్యంగా సీపీఎం శ్రేణులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో ఓ పాట అందరిని ఆకట్టుకుంటుంది. డివైఎప్ ఐ నేత మందుల విప్లవ్ కుమార్ రాసిన  ఈ పాట ప్రతి ఒక్కరిని  ఆలోచించే విధంగా ఉంది. ఆ పాట కింద పద్య రూపంలో ఉంది చదవండి.

పల్లవి: మల్లు లక్ష్మీ గెలవాలి మళ్ళీ స్వరాజ్యమవ్వాలి మల్లు లక్ష్మి గెలవాలి

నలుగురిని నడిపించాలి నల్లగొండ వెలుగవ్వాలి

జయహో సిపిఎం జయహో సిపిఎం జైజై జయహో సిపిఎం

చరణం :1.

బీడుబడ్డ భూములకు సాగర్ నీళ్ళను తెచ్చి

నల్లగొండ కాళ్ళ దుమ్మును కడిగిందెవరూ

అన్నదాత కన్నీటిని తుడిచిందెవరూ

రైతు గిట్టుబాటు ధరను అడిగిందెవరూ

సుత్తె కొడవలి నక్షత్రం సుత్తె కొడవలి నక్షత్రం సుత్తె కొడవలి నక్షత్రం

జయహో సిపిఎం జయహో సిపిఎం జైజై జయహో సిపిఎం

మల్లు లక్ష్మీ గెలవాలి మన అందరి బరువును దించాలి ఎర్రాజెండై మెరవాలి

2.రైతును నిలబెట్టేలా రాజ్యాన్ని మేల్కొల్పేలా

రాజేసి ఉద్యమాలను నడిపిందెవరూ

ఈ నేలకు పోరాటాన్ని నేర్పిందెవరూ

త్యాగాల తేనెపట్టును పంచిందెవరూ

సుత్తె కొడవలి నక్షత్రం సుత్తె కొడవలి నక్షత్రం సుత్తె కొడవలి నక్షత్రం

జయహో సిపిఎం జయహో సిపిఎం జైజై జయహో సిపిఎం

మల్లు లక్ష్మీ గెలవాలి నల్లగొండ నవ్వై విరియాలి ఎర్రాజెండై ఎగరాలి

3.ఆడవాళ్ళ హక్కులకూ అతివల గొంతయ్యీ

అణగారిన బతుకుల తోడై నడిచిందెవరూ

అంటరాని గుండెల పొద్దై పొడిచిందెవరూ

సమానత్వ సాధన కొరకు సాగిందెవరూ

సుత్తె కొడవలి నక్షత్రం సుత్తె కొడవలి నక్షత్రం సుత్తె కొడవలి నక్షత్రం

జయహో సిపిఎం జయహో సిపిఎం జైజై జయహో సిపిఎం

మల్లు లక్ష్మీ గెలవాలి పేదోళ్ళ అండై ఉండాలి ఎర్రాజెండై నిలవాలి

4.విద్యార్థుల చదువులకై ప్రభుత్వాల నిలదీసి

పదునెక్కిన ప్రశ్నలనే విసిరిందెవరూ

నాణ్యమైన చదువులకై అడిగిందెవరూ

కొలువులకై కొట్లాటలు చేసిందెవరూ

సుత్తె కొడవలి నక్షత్రం సుత్తె కొడవలి నక్షత్రం సుత్తె కొడవలి నక్షత్రం

జయహో సిపిఎం జయహో సిపిఎం జైజై జయహో సిపిఎం

మల్లు లక్ష్మీ గెలవాలి మా చదువుల వెలుగై పూయాలి మా ఇంట్లో కొలువై ఉండాలి

5.సూర్యాపేట కోదాడ హుజూర్నగర్ మిర్యాలగూడెం

నల్లగొండ సాగర్ల అభివృద్ధెవరూ

దేవరకొండ గడపగడపనూ తట్టేదేవరూ

తండాలు గూడాలల్లో తిరిగిందెవరూ

సుత్తె కొడవలి నక్షత్రం సుత్తె కొడవలి నక్షత్రం సుత్తె కొడవలి నక్షత్రం

జయహో సిపిఎం జయహో సిపిఎం జైజై జయహో సిపిఎం

మల్లు లక్ష్మీ గెలవాలి మా గడపలో పసుపై మెరవాలి అభివృద్ధికి ఆజ్ఞై నడవాలి

-✍ ఎం.విప్లవ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *