కేటీఆర్ కు శ్రవణ్ దాసోజు 6 ఘాటు ప్రశ్నలు

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. ఆయన ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కేటీఆర్ కు 6 సూటి ప్రశ్నలు సంధించారు. అవి కింద ఉన్నాయి చదవండి.
1. నాతోనుంటే దేశభక్తులు, లేకపోతే దేశద్రోహులా అని ప్రశ్నించిన మీరు కూడా చేసిందేమిటి? తెరాసలో చేరితే తెలంగాణ వాదులు, మీ తప్పుడు నిర్ణయాలకు భజన కొడితే తెలంగాణ వాదులు, కాని ప్రశ్నిస్తే తెలంగాణద్రోహులు అని తమరు దౌర్జన్యంగా ముద్ర వేసినప్పుడు ఈ సోయి ఎందుకు లేదో?
2. ప్రశ్నించే స్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని మాట్లాడుతున్న మీకు ప్రతిపక్ష పార్టీల ఏంఎల్ఏ లను, ఏంపి లను, క్షేత్ర స్థాయి నాయకులను సంతలో గొడ్లను కొన్నట్టు కొన్నప్పుడు, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిన్నప్పుడు ఈ నీతి సూత్రం గుర్తుకు రాలేదా?
3. ధర్నా చౌక్ ఎత్తివేసి ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అక్రమ కేసులు బనాయించి బెదిరించి, జేళ్ల్లలో పెట్టినప్పుడు ఈ తెలివి ఎందుకు లేదు.
4. ప్రజాస్వామ్యం విలువల గూర్చి మాట్లాడిన మీరు తెలంగాణ లేజిస్లేటివ్ అసెంబ్లీలో, కౌన్సిల్ లో కనీసం ప్రతిపక్షం లేకుండా చేయడం మీ హిపోక్రసీ కి నిదర్శనం కాదా?
5. మత రాజకీయాలొద్దు అని సిద్ధాంతాలు వల్లించిన మీకు పచ్చి మతోన్మాద పార్టీ ఎం ఐ ఎం తో పొత్తు ఎందుకు? మీ మాటలు ప్రజల్ని మోసం చేయిడానికి కాకపోతే ఎం ఐ ఎం తో మీ పొత్తు రద్ధు చేసుకుంటారా?
6. మీరన్నట్లుగా ఒకవేళ కేంద్రం మతోన్మాద రాజకీయాలకు పాల్పడితే, వారికే బేషరతుగా నోట్ల రద్దు, జిఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నీతి ఆయోగ్, త్రిబుల్ తలాక్, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్ట్ సవరణ, 370 ఆక్ట్ రద్దు లాంటి అనేక అంశాలలో బీజేపీకి మద్దతు ఎందుకు ఇచ్చినట్లు?
ఊసరవెల్లి వలే పూటకో మాట మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే, ఎల్లకాలం సాధ్యం కాదు. దయ చేసి తెలంగాణ ప్రజలకున్న విజ్ఞతను తక్కువ అంచనా వేయవద్దని, రెండు నాల్కల రాజకీయాలు మానుకోవాలని విజ్ఞప్తి అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి
శ్రీరామచంద్రుడి వారసులమని చెబుతున్న బిజెపి ఎంపి