సోషల్ మీడియాలో సమస్య చెప్పిన యువకుడు.. స్పందించిన సీఎం కేసీఆర్

ఓ యువకుడి సమస్య పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించారు. మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన శరత్ అనే యువకుడు తమ కుటుంబం ఎదుర్కొంటున్న భూ సమస్యను వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వీడియోను చూసిన వెంటనే కేసీఆర్ స్పందించారు. రైతు శరత్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో కింద ఉంది చూడండి.

 

సీఎం కేసీఆర్ ఫోన్ లో స్పందించిన ఆడియో కింద ఉంది వినండి

శరత్ కుటుంబంతో స్వయంగా ఫోన్ లో  మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు వెళ్లాయి. ఈ సందర్భంగా కలెక్టర్ హోలికేరి భారతి గ్రామానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడారు. న్యాయం చేస్తానని హామీనిచ్చారు.

 

2 thoughts on “సోషల్ మీడియాలో సమస్య చెప్పిన యువకుడు.. స్పందించిన సీఎం కేసీఆర్

  1. ఇలాంటి లాంఛకోండిలు ఉన్నన్ని రోజులు కష్టాలు తప్పవు, ఇలాంటి వారు ప్రతి కార్యాలయం లో ఉన్నారు , అందుకే ఇలాంటి వారి పైన వెంబడే సస్పెండ్ చేయాలి , ఉద్యోగం లేకుండా చేయాలి , అప్పుడే తగిన న్యాయం ప్రజలకు జరుగుతుంది

  2. This is the greatness of Telangana CM, KCR Garu. Even I am facing the same problem on account of Corrupt ex-Revenue Inspector, ex-Dy Tahsildar & ex-Tahsildar of Toopran (V&M) KCR’s own Cobstituency Can the CM look into the matter & do justice to us by cancelling illegal ROR proceedings & restoring our land rights to us?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *