చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ కు రంగం సిద్ధం…

మే నె 14న మంత్రివర్గ సమావేశం జరిపేందుకు రంగం సిద్ధమవుతూ ఉంది.

సమావేశానికి అజండా స్పష్టంగా ఉన్నపుడే తాను ఏర్పాట్లు చేసేందుకు వీలవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం చె ప్పడంతో క్యాబినెట్ సమావేశం వివాదాస్పదమయింది.

తర్వాత  ముఖ్యమంత్రి కార్యాలయం అజండా రూపొందించింది.

ఇది గురువారం నాడు ఎల్ వి సుబ్రహ్మణ్యం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటి పరిశీలనకువచ్చింది. అజెండాను కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ అజండాను సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందిస్తుంది. ఎన్నికల కమిషన్ నుండి ఒకటి రెండు రోజులలో అంటే సోమవారం నాటికి ఆమోదం వచ్చే అవకాశం ఉంది.

గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన కమిటీ సమావేశానికి రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ విభాగం) కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి కన్వీనర్‌ గా వున్నారు.

సమావేశానికి ఇంకా వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్‌, పశుసంవర్ధకశాఖ ముఖ్యకార్యదర్శి బి.శ్రీధర్‌, మున్సిపల్‌ పరిపాలన పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి కరికాలవల్‌వన్‌, పంచాయితీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి వరప్రసాద్‌లు పాల్గొన్నారు. రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆలస్యంగా హాజరయ్యారు.

ప్రధాన కార్యదర్శి నుంచి ఎలాంటి నెగెటివ్ రిమార్క్స్ లేకుండా వెళ్తున్నందున, స్క్రీనింగ్ కమిటీ నివేదికను ఎన్నికల కమిషన్ ఆమోదించకతప్పదని అధికారులు భావిస్తున్నారు.

నిజానికి ఈ నెల ఈనెల 11న కేబినేట్‌ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి భావించారు.

కేంద్రంలో ప్రధాని మోదీ క్యాబినెట్ లు నిరాటంకంగా నిర్వహిస్తున్నపుడు ముఖ్యమంత్రి ఎందుకు నిర్వహించరాదని చంద్రబాబు నాయడుు  ప్రశ్నిస్తున్నారు. వేసవిలో చర్చించాల్సిన అత్యవసర అంశాలు చాలా ఉన్నాయని , ఇవన్నీ ప్రజలకు సంబంధించిన విషయాలని, వాటిని ఎన్నికల కోడ్ పేరుతో ప్రభుత్వం  ఉపేక్షించడం సాధ్యం కాదని ఆయన క్యాబినెట్ సమావేశానికి  తేదీ (మే 11) అని ఖరారు చేశారు.

ఎన్నికల కోడ్ ఉన్నందున కమిషన్ అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడం సాధ్యం కాదని, దీనికి స్పష్టమయిన అజండా ఉండాలని ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం సూచించారు.

ముఖ్యమంత్రి కార్యాలయం ఈ సూచనను అంగీకరించి క్యాబినెట్ అజండాను తయారుచేసి సిఎస్ కు పంపించారు.

దీనితో క్యాబినెట్ సమావేశాన్ని ఈ నెల 14కు వాయిదా వేసుకున్నారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులు, ఉపాధిహామీ పనులు, వివిధ జిల్లాల్లో మంచినీటి సమస్య తదితర అత్యవసరం అంశాల మీద క్యాబినేట్‌ సమావేశం జరగుగుతుందని , దీనికి అనుమతించాలని

మంగళవారం ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌ ప్రధాన కార్యదర్శిని కలిసి ఒక నోట్ సమర్పించారు. అటువైపు క్యాబినెట్ సమాశాన్ని జరపాల్సిన అవశ్యకత మీద ముఖ్యమంత్రి కూడా ఎన్నికల కమిషన్ కు కూడదా లేఖ రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *