మార్కులు తక్కువా, క్రుంగిపోవద్దు, ఈ ఐఎఎస్ ఆఫీసరే మన హీరో…

మార్కులు తక్కువచ్చాయని తెలుగు విద్యార్థులు క్రుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఫెయిలయ్యామనీ ఆత్మహత్య చేసుకుంటారు. ఒక చిన్న పరీక్ష ఇంతగా క్రుంగదీయరాదు. ఒక పరీక్ష పాసయినంత మాత్రాన, లేదా టాప్ మార్కులు వచ్చినంత మాత్రాన జీవితం ఒక్కసారిగా పూటబాట కాబోదు. ఫెయిలయింత మాత్రాన ప్రపంచంలో భవిష్యద్ద్వారాలన్నీ మూసుకుపోవు. పదో తరగతి లేదా ఇంటర్ చదివే కుర్రాడి ముందు నూరేళ్ల పోడవయిన బాట ఉంది. బాధపడ్తే ఎలా, మీ భవిష్యత్తలో మీకు తెలియని ఎన్ని ఘనవిజయాలున్నాయో… మార్కులు వేరు, కాలిబర్ వేరు…
ఈ విషయమే చెప్పాలనుకుంటున్నాడు చత్తీష్ గడ్ రాష్ట్రానికి ఒక జిల్లాకలెక్టర్. అత్తెసరు మార్కులతో పాసయినా ఎపుడు క్రుంగి కృశించి పోలేదు. ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అందులో ఏ వింతలు విశేషాలున్నాయో చూద్దాం అనుకుని ఆ కొద్ది మార్కులతోనే ముందుకు సాగిపోయాడు.
మార్కులు తక్కువ వచ్చాయని ఆయన కుటుంబ సభ్యులు షాక్ తినివుండాలి. అలాగే ఆయన కూడా బాధపడి ఉండాలి. అందుకని జీవితం నుంచి పారిపోలేదు… ఆ తక్కువ… చాలా తక్కువ మార్కులతోనే ముందుకు అడుగేశాడు. 2009లో ఐఎస్ ఎస్ పాసయ్యాడు.

అందుకే తక్కువ మార్కులొచ్చాయని కొడుకులను, కూతుళ్లను గుచ్చి గుచ్చి చంపే తల్లితండ్రులకోసం, కుమిలిపోతున్న కుర్రవాళ్లకోసం ఆయన తన మార్కుల లిస్టును ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.
ఆయన పేరు అవనీష్ కుమార్ శరణ్. 2009 ఐఎ ఎస్ బ్యాచ్ అధికారి. ఇపుడు కవార్ధా జిల్లా కలెక్టర్ గా ఉంటున్నారు.
ఈ మధ్య చత్తీష్ గడ్ లో విడుదల చేసిన టెన్త్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఒక కుర్రవాడు ఆత్మహత్య చేసుకున్నపుడు చలించి ఆయన వాళ్లకి ధైర్యం చెప్పేందుకు ఫెస్ బుక్ ద్వారా సలహా ఇవ్వాలనుకున్నాడు.

 ఆలీబాబా ఉద్యోగలకు కొత్త సంసారపు చిట్కా 669, అంటే ఏమిటి?

తన మార్కుల లిస్టు పోస్టు చేసి, అనుకోని విధంగా తక్కువ మార్కులొచ్చినపుడు నిరాశ పడవద్ద, మనోనిబ్బరం కోల్పోవద్దు అని చెప్పారు.
‘ మార్కుల శాతం అనేది కేవలం ఒక నెంబర్ గేమ్. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేందుకు మీకు ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. ముందుకు సాగండి, అని ఆయన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

“Today I read a shocking news in newspaper that one student committed suicide because of unexpected result in the exam. I appeal to all students and their parents not to take the result very seriously! It’s just a number game. You will be getting many more chances to prove your caliber.keep moving…”

అంతేకాదు, నిరాశకు లోనైన విద్యార్థలను కేవలం మాటలతోనే దారికి తీసుకురాలేమని ఆయన ఏంచేశాడో తెలుసా, తన మార్కుల జాబితాను కూడా ఫేష్ బుక్ లో పోస్టు చేశారు. ఆయన తన పదో తరగతి,పన్నెండో తరగతి మార్కులను సిగ్గు పడకుండా ప్రపంచం ముందుంచారు.

ఆయనకు పదో తరగతిలో ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా? కేవలం 44.5 శాతమే. ఇక ఇంటర్ లో ఏమయిన దండిగా మార్కులొచ్చి ర్యాంకులొచ్చాయా, అదీ లేదు. వచ్చిన మార్కులు కేవలం 65 శాతమే.
ఇక డిగ్రీలో వచ్చిన మార్కులు కూడా గర్వపడేలా లేవు. కేవలం 60.7 శాతమే.
అయితే, ఈ మార్కులను చూస్తే తెలుగోళ్లు గుండెలు బాదుకుంటారు. విద్యార్థుల సంగతేమోగాని, ముందు తల్లితండ్రులు గుండెలు జారిపోతాయి. ఇరుగు పొరుగు విద్యార్థులతో పోల్చి లేదా యుఎస్ లో ఉన్న బంధువులబ్బాయిని చూపి  వాళ్లే సగం చంపేస్తారు.
ఇంత తక్కువ మార్కులొచ్చినా అవనీష్ కుమార్ నిరాశపడలేదు. తను చదవడం అపలేదు. కష్టపడి చదివాడు. సివిల్స్ ర్యాంకు సాధించాడు.
పదో తరగతిలో తన తక్కువ మార్కులు చూసి తల్లితండ్రులు కూడా మంచికాలం ముందుందని ఎంకరేజ్ చేశారు. అవ్నీష్ కు మంచి కాలం టెన్త్ క్లాస్ లో లేదు, సివిల్స్ లో ఉండింది.
అలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కారి బ్రేకింగ్ ఉంటుంది. దాన్ని వెదుక్కంటూ పోవడమే అవ్నీష్ చేసింది.
గత శనివారం నాడు టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి. తక్కువ మార్కులచ్చాయని ఒక కుర్రవాడు ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన వార్తలు చూశాక, అవ్నీష్ తన అకడమిక్ రికార్డును అందరితో షేర్ చేసుకుని ఆత్మ స్థయిర్యం కల్పించేందుకు సహకరించాలనుకున్నాడు.
అదివారంనాడు ఫేస్ బుక్ లో తన మార్కుల లిస్టు పోస్టు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *