Home ట్రెండింగ్ న్యూస్ తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మీ పేరు చెక్ చేసుకోండి

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మీ పేరు చెక్ చేసుకోండి

450
0
SHARE

తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు తరుణం ఆసన్నమైంది. ఎన్నికల సమరం ముంచుకొస్తున్నది. ఈ సమయంలో పోటీ చేసేవాళ్లు తమ ఏర్పాట్లలో ఉన్నారు. ప్రచారం జోరుగా సాగిస్తున్నారు.

మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత సమరం షురూ అయింది. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు జనాలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే అందరినీ వేధించే ప్రశ్న ఏమంటే అసలు పంచాయతీ ఎన్నికల్లో మన ఓటు ఉందో లేదో అన్న డౌటనుమానం అందరికీ కలగక మానదు.

అలా డౌట్లు రావడానికి కూడా అనేక కారణాలున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లక్షల సంఖ్యలో ఓట్లను గల్లంతు చేసింది. తుదకు తెలంగాణ ఎన్నికల సిఇఓ రజత్ కుమార్ జనాలకు బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు.

గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటేసిన వారికి ఈసారి ఓటు గల్లంతైంది. అందుకే ఏ ఎన్నికకు ఆ ఎన్నికకు ఓటు ఉందా లేదా అన్న అనుమానాలు ఓటర్లను పీడిస్తున్నాయి. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో లేదో? ఏమైనా వార్డులు మారాయా? లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా తెలియాలంటే కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీ జిల్లా, మండలం, పంచాయతీ, వార్డు వివరాలు నమోదు చేసి ఓపెన్ చేయండి.

ఓటు ఉందో లేదో మరోసారి కన్ఫామ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం కిందనే లింక్ ఉంది.

తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్స్ ఓటర్ లిస్ట్ 

http://elecroll.tsec.gov.in/gpWardWiseElecrolls.do