బాలయ్య సినిమా చూసిన చంద్రబాబు రియాక్షన్

ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన కథానాయకుడు సినిమాను చంద్రబాబు చూశారు. ఈ చిత్రంలోని హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ జాగర్లమూడిని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో సన్మానించారు.

అంతేకాదు గురువారం రాత్రి విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఉన్న ట్రెండ్ సెట్ మాల్ లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను చంద్రబాబు వీక్షించారు. బాలకృష్ణ, క్రిష్ ఇద్దరూ ఎన్టీఆర్ పాత్రను అద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు చంద్రబాబు. దర్శకుడు క్రిష్ ను అభినందించారు. ఈ సందర్భంగా బాబు ఏమన్నారో చదవండి.

కథానాయకుడు సినిమా అద్భుతంగా ఉంది. యుగ పురుషుని జీవితం తీయడం నిజంగా సాహసం. యన్టీఆర్ వేసినన్నీ పాత్రలు ఇంకెవ్వరూ వేయలేరు. వెంకటేశ్వరుడు, శ్రీరాముడు, రావణుడు, వంటి పాత్ర లకు ఆయనే సాటి. అటువంటి మహనీయుడు మళ్లీ పుట్టబోడు.

బాలకృష్ణ ఎలా చేస్తాడో అనుకున్నా.. కానీ పాత్ర లో జీవించాడు. కొన్ని సన్నివేశాల్లో యన్టీఆర్‌ మళ్లీ వచ్చాడా అన్నట్లుగా చేశాడు. యన్టిఆర్ తో ఉన్న జ్ఞాపకాలను మరోసారి నాకు గుర్తు చేశారు. దర్శకుడు క్రిష్ అందరినీ ఆకట్టుకునేలా తీయడం అతని గొప్పతనం.

యన్టిఆర్ చరిత్రను అందరూనచ్చేలా, మెచ్చేలా బాలకృష్ణ పాత్రలో‌జీవించారు. మా కుటుంబమే కాదు… తెలుగు జాతి గర్వించదగిన సినిమా. యన్టీఆర్‌ జీవితం గురించి అందరూ తెలుసుకుని స్పూర్తిని పొందాలి. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వదిలి, మదరాసు‌ వెళ్లినా యన్టీఆర్‌ ఎప్పుడూ ఆత్మ గౌరవంతో, ఆత్మ విశ్వాసం తో పని చేశారు.

ప్రజల కోసమే పార్డి పెట్టి రాజకీయాల్లోకి‌ వచ్చి సేవ చేశారు. స్పూర్తిని పొందాలసిన సినిమా కధానాయకుడు.. అందరూ చూడాలి. సినిమాలో అందరి పాత్రలకు జీవం పోశారు.. సహజత్వంగా తీసి క్రిష్ అందరినీ మెప్పించారు. యన్టీఆర్‌ జీవితం అందరికీ ఆదర్శప్రాయం.. మహానాయకుడి లో కూడా రాజకీయ జీవిత ఘట్టాల ఆకట్టుకుంటాయని భావిస్తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *