స్మార్ట్ ఫోన్ పోయిందా, ట్రేస్ చేయడం చాలా ఈజీ.. ఎలాగంటే…

ఖరీదైన స్మార్ట్ ఫోన్ పోతే… ఇంకే ముంది , ఒక వారం రోజులు నిద్ర రాదు.
అయితే, పోయిన ఫోన్  ఎక్కడుందో  కనిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక టెక్నాలజీని ప్రవేశపెడుతూ ఉంది.
మీ స్మార్ట్ ఫోన్ పోయినా, అందులో నుంచి సిమ్ కార్డు తీసేసినా పర్వాలేదు. పోయిన  స్మార్ట్ ఫోన్ ఎక్కుడుందో ఈజీగా తెలియచేసే టెక్నాలజీ ఇది.
అంతేకాదు, IMEI (International Mobile Equipment Identity) నంబర్ మార్చేసినా ఈ టెక్నాలజీ మీ ఫొన్ ఎక్కడుందో పసిగడుతుంది.
ఈ టెక్నాలజీని సి.డాట్ ( సెంటర్ ఫర్ డెవెలప్ మెంట్ అఫ్ టెలిమాటిక్స్ )రూపొందిచింది. ఈ టెక్నాలజీ సర్వీసులు ఆగస్టులో అందుబాటులోకి వస్తున్నాయి.
సి.డాట్ ఈ టెక్నాలజీ అంటే సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటి రిజిస్టర్ (CEIR) మీద జూలై 2017 నుంచి పని చేస్తూ ఉంది. ఇప్పటికి పూర్తయింది. డూప్లికేట్ మొబైల్ ఫోన్ లను, స్మార్ట్ ఫోన్ దొంగతనాలను అరికట్టేందుకు ఈ ప్రాజక్టును చేపట్టారు.
CEIR సిస్టమ్ మీరు పొగొట్టుకున్న స్మార్ట్ ఫోన్ కు ఏ నెట్ వర్క్ నుంచైనా సర్వీస్ ను పూర్తిగా బంద్ చేస్తుంది. సిమ్ ను మార్చిన, ఐఎంఇఐ నెంబర్ ను మార్చినా సర్వీసులబంద్ అవుతాయి.
ఈ సిస్టమ్ IMEI డేటాబేస్ ను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లన్నింటికి కనెక్టు చేస్తుంది. దీనితో మొబెల్ పోయినట్లు ఫిర్యాదు రాగానే ఈఫోన్ కు సర్వీస్ బంద్ అవుతుంది.
ఈ సిస్టమ్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లందరికి సెంట్రల్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. బ్లాక్ లిస్టెడ్ మొబైల్ టర్మినల్స్ ను అందరికి చేరవేస్తుంది. అందువల్ల ఒక నెట్ వర్క్ లో బ్లాక్ లిస్టయితే, చాలు ఆఫోన్ లో ఏ నెట్ వర్క్ పనిచేయదు.