పవన్ కు టాటా; బిజెపి వైపు కదులుతున్న జెడి లక్ష్మినారాయణ

జనసేన పార్టీ కి మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ, అతని సన్నిహితుడు గంపల గిరిదర్ గుడ్ బయ్ చెప్పనున్నారని వార్తలొస్తున్నాయి.
ఈ సారి ఆయన అటు ఇటు చూడకుండా నేరుగా బిజెపిలో చేరుతున్నారని రాజకీయ వర్గాల్లో వినబడుతూ ఉంది.
మహారాష్ట్ర ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజకీయ జీవితం గురించి చాలా వూహగానాలు వినపడ్డాయి.
సొంతంగా పార్టీ పెడుతున్నారని అన్నారు. లేదు, లోక్ సత్తాతో కలసి పని చేస్తారని చెప్పారు. కాదు కాదు, బిజెపిలో చేరతారని చెప్పారు.

ఇది కూడా చదవండి:

అమెరికా-చైనా ట్రేడ్ వార్… ఇంతకీ ఆ గొడవ ఏంటి?
ఒకదశలో ఆయన టిడిపిలో కూడా చేరాతారనే వూహాగానాలు వినవచ్చాయి. అయితే వీటన్నింటిని కాదని ఆయన జనసేన పార్టీలో చేరారు.
ఆ పార్టీతరఫున విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జనసేన దారుణంగా ఓడిపోవడంతో ఆయన అసలు ఆపార్టీలోనే ఏదో పెద్ద లోపం ఉందని భావించారని అందుకే ఎన్నికల తర్వాత ఆయన యాక్టివ్ గాలేరని చెబుతున్నారు.
ఇపుడు తనతో పాటి విశాఖ సౌత్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గంపా గిరిధర్ ను వెంటేసుకుని ఆయన తొందర్లో పార్టీ నేత అమిత్ షాను కలుస్తున్నారట.
ఇలా చాలా మంది జనసేన నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇపుడు పార్టీలో నెంబర్2 అయిన నాదెండ్ల మనోహర్ కూడా అదును చూసి అటువైపు వెళతారని చెబుతున్నారు. ఎందుకంటే, ఇప్పటికే ఆయన తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు బిజెపిలో చేరారు. ఆయన సైగచేస్తూనే మనోహర్ బిజెపిలోచేరతారని అనే అనుమానం చాలా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.