గొట్టు గ్రామర్ ను పక్కన పెట్టేసి ఇంగ్లీష్ నేర్చుకోండిలా !

ప్రముఖ ఇంగ్లీష్ ఫ్ల్యూయెన్సీ కోచ్ బికే రెడ్డి తాజాగా ఆన్ లైన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ షురూ చేశారు. కరోనా నేపథ్యంలో క్లాస్ రూమ్ పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోలేని వాతావరణం ఉన్నందున ఆన్ లైన్ ద్వారా ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. యూట్యూబ్ లో 15 వీడియో లెసన్స్ ద్వారా అభ్యర్థులకు బికే రెడ్డి ఇంగ్లీష్ లో మాట్లాడే శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఆయన లకిడీకపూల్ లోని సెంట్ హోటల్ లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించేవారు. ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా జరుగుతున్నది. తాజాగా బికెే రెడ్డి ఇంగ్లీష్ అభ్యర్థుల కోసం Fluency Guide విడుదల చేశారు. ఇంగ్లీష్ లో సులభంగా మాట్లాడాలంటే ఎలా అనేదానిపై ఆ గైడ్ లో వివరణ ఉంటుంది. ఆయన వెలువరించిన e-book ను యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాం. చదవవచ్చు. మరిన్ని వివరాల కోసం  Shadow Tv లో బికె రెడ్డి ఇంటర్వ్యూలు చూడవచ్చు.
1
Road map to Fluency
ప్రధానంగా భాషలు రెండు రకాలుగా నేర్చుకోబడుతాయి. మొదటిది పరిసరాల ద్వారా, రెండోది అభ్యసన ద్వారా. ప్రతీ ఒక్కరూ వారి, వారి మాతృభాషలు సహజంగా నేర్చుకుంటారు. ఉదాహరణకు హైదరాబాద్ లో నివశించేవారు మాతృభాష తెలుగుతోపాటు హింది లేదా ఉర్దూలో కూడా మాట్లాడుతారు. వినే మాటలను అనుకరించడం ద్వారా పరిసరాల నుంచి భాషలు సహజంగా, సులభంగా నేర్చుకోబడుతాయి. ఈ కారణంగానే నెమలి ఈకలు అమ్ముకునే ముంబాయి యువకుడు జాతీయ, అంతర్జాతీయ భాషలు కలిపి 16 భాషలు నేర్చుకున్నాడు. అతడికి సంబంధించిన వీడియోలు మీరు యూట్యూబ్ లో చూడవచ్చు. చదవటం, రాయటం తెలియకున్నా, గ్రామర్ పరిజ్ఞానం లేకున్నా భాషలు నేర్చుకోవచ్చని మన చుట్టూ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
భాషల్ని పరిసరాల ద్వారా నేర్చుకోవడంలో వినటం (Listening) మరియు మాట్లాడటం ( Speaking) ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ ఇంగ్లీష్ ఇలా నేర్చుకునే అవకాశం మనలాంటి దేశాల్లో లేదు. కారణం మన పరిసరాల్లో ఇంగ్లీష్ వాతావరణం లేకపోవడమే. దీంతో కేవలం పుస్తకాల ద్వారానే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని కోచింగులకు వెళ్లినా, ఎంత గ్రామర్ నేర్చుకున్నా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోవడం మనందరికీ తెలిసిందే.
ప్రపంచంలో ఏ భాషనూ గ్రామర్ ద్వారా నేర్చుకోరు. గ్రామర్ ద్వారా భాష నేర్చుకోవడం సాధ్యపడదు కూడా. మీలో ఎవరైనా తెలుగు గ్రామర్ ద్వారా నేర్చుకున్నారేమో గుర్తుకు తెచ్చుకోండి. అంతెందుకు మనందరికీ సుపరిచితురాలైన బుల్లి తెర యాంకర్ సుమ తెలుగు అనర్గళంగా మాట్లాడుతారు. కానీ ఆమె మాతృభాష మలయాళం. తెలుగింటి కోడలు కావడం మూలంగానే ఆమె తెలుగు నేర్చుకోగలిగింది.
మాట్లాడటం మనసు మరియు శరీరానికి సంబంధించిన నైపుణ్యం. కేవలం మనసు ద్వారానో లేదా శారీరక ప్రయత్నం ద్వారానో భాషను నేర్చుకోవడం సాధ్యం కాదు. భాష నేర్చుకునే ప్రయత్నంలో మనసు మరియు శరీరం అనుసంధానం చేస్తేనే మాట్లాడే నైపుణ్యం సిద్ధిస్తుంది. సైక్లింగ్, స్విమ్మింగ్ పుస్తకాల ద్వారా ఎలాగైతే నేర్చుకోలేమో.. ఇంగ్లీష్ మాట్లాడటం కూడా కేవలం పుస్తకాల ద్వారా రాదు. కానీ మన విద్యా విధానంలో ఇంగ్లీష్ బోధన, అభ్యసన పుస్తకాలకే పరిమితమమయ్యాయి. ఇలా ఎంతకాలం ప్రయత్నించినా ఇంగ్లీష్ నేర్చుకోవడం సాధ్యం కాదు. L- S- R- W క్రమంలో అభ్యసిస్తేనే భాషలు నేర్చుకోగలం. మన ఇంగ్లీష్ అభ్యసనలో listening, speaking గల్లంతు కావడం మూలంగానే ఇంగ్లీష్ నేర్చుకోవడం గతి తప్పింది. ఫలితంగా ఇంగ్లీష్ పట్ల ఎన్నో అపోహలు ఏర్పడ్డాయి. ఈ అపోహలే అడుగు ముందుకు వేయనివ్వడంలేదు, నోరు తెరిచి మాట్లాడనివ్వడంలేదు.
2
Myths and Facts
(అపోహలు మరియు వాస్తవాలు)
ఊహ తెలిసిన దగ్గరి నుండి మనందరికి ఇంగ్లీష్ ఒక బ్రహ్మపదార్థం. చదవటం, బట్టీ పట్టడం, పరీక్షలు రాయటం, తరగతులు మారటం, పట్టాలు అందుకోవడం ఇదొక అంతులేని కథ. అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగినా గ్రామర్ గుర్తుకొచ్చి మనలాంటి వారికి అసాధ్యమని ఆగిపోతున్నాము. ఇంగ్లీష్ తప్పనిసరి అని తెలుసుకునేలోపే మనలో ఎన్నో అపోహలు నిండిపోయాయి.

 

సుదీర్ఘ కాలం అభ్యసించినా ఇంగ్లీష్ నేర్చుకోలేకపోవడంతో ఎన్నో అపోహలు, భయాలు ఏర్పడ్డాయి. అందులో ప్రధానమైనవి ఇంగ్లీష్ కష్టమైన భాష, ప్రతిభావంతులే నేర్చుకోగలరనేవి. వాస్తవానికి ఇంగ్లీష్ చాలా సులువైన భాష. చదువుకు సంబంధం లేకుండా ఎవరైనా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ప్రపంచంలో ఇంగ్లీష్ వేగంగా విస్తరించడానికి ఇవి కూడా ప్రధాన కారణాలు.
చదువు రాని రైల్వే కూలి రాజన్న వీడియో మీరు చూసే ఉంటారు. అతడు ఇంగ్లీష్ మాట్లాడటమే కాకుండా ఇంగ్లీష్ సహజంగా ఎలా నేర్చుకోవాలో చాలా గొప్పగా చెప్పాడు. కేవలం క్రికెట్ కామెంట్రీ వింటూ ఓ అంధుడు ఇంగ్లీష్ నేర్చుకున్న తీరు అనుకరణ ద్వారా భాషలు సులభంగా నేర్చుకోవచ్చన్న విషయాన్ని తెలియజేస్తున్నది.
3
Rules of speech
1 don’t focus too much on grammar
2 study and learn real life expressions
3 practice mind talk, self talk and cross talk (MSC)
మొదటగా గ్రామర్ ద్వారా భాషలు నేర్చుకోవడం వీలు కాదన్న విషయం గ్రహించాలి. రెండోది విడి పదాలు కాకుండా నిజ జీవితంలో మాట్లాడే మాటలు నేర్చుకోవాలి. శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ – వింగ్లీష్ సినిమాలో ఇంగ్లీష్ సహజంగా ఎలా నేర్చుకోవాలో కొంతవరకు చూపే ప్రయత్నం చేశారు. మూడవది మాట్లాడే స్వీయ అభ్యాసం. మన పరిసరాల్లో ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం లేనందున మూడో నియమం తప్పకుండా పాటించాలి.
4
Tools of speech
వ్యవహారిక భాషలో ప్రధానంగా మూడు రకాల మాటలుంటాయి.
1 Statement patterns (positive and negative )
2 Question patterns (Yes/ No questions and w/h questions)
3 Real life short expressions
మొదటి రెండింటినీ patterns రూపంలో నేర్చుకోవాలి. మూడోదానికి సంబంధించిన మాటల్ని యధావిధిగా నేర్చుకొని మాట్లాడే అభ్యాసం చేయాలి. ప్రతీ అభ్యాసంలో mind talk, self talk and cross talk ఉండాలి.
5
Principles of speech
1 Languages are learnt by speaking and not by reading or writing. Spoken English self practice is essential for fluent English.
2 Focus on how you can speak from what you know and not on various grammar rules.
3 You need to learn what you should say in different contexts of your life, and practise Speaking.
4 Speaking is a physical skill and therefore can’t be acquired mentally as being tried in our traditional education.
5 You can’t except to become fluent in English by constructing sentences in your lead while speaking.
అంతిమంగా సరైన మెటీరియల్, మెథడ్, మరియు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అభ్యసనలో కీలక పాత్ర పోషిస్తాయి. మరింత క్లారిటీ కోసం యూట్యూబ్ లో బికె రెడ్డి వీడియోలు చూడగలరు.
Good luck for a humble right beginning!
For BK Reddy online / classroom English fluency training,
please contact 9912343940
or visit www.bkrealenglish.com