అక్బరుద్దీన్ పై ముస్లిం మహిళ పోటీ, ఆమె ఎవరో తెలుసా?

హైదరాబాద్: బీజేపీ పార్టీ  ఒకసంచలన నిర్ణయం తీసుకుంది. పాతబస్తీలో బీజేపీ-ఎంఐఎం మధ్యలోనే ప్రధాన పోటీ ఉంటుంది. ఎప్పటికైనా సరే పాత బస్తీ బిజెపి జండా ఎగరేయాలన్నది  ఆ పార్టీ ఆశ. ముఖ్యంగా ఎంఐఎం ఒవైసీ బ్రదర్స్ ను ఓడించాలన్నది  బిజెపి ఆశయం. పాత బస్తీల పార్ట ీజండాలు కనిపించడం ఎక్కువవుతున్న ఓట్లు పెద్దగా పెరగడం లేదు.  ఎంబీటీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో బిజెపి బలం పుంజుకుంటుంని బిజెపి నమ్ముతూ ఉంది. అందుకే ఈ సారి అక్కడి నుంచిపోటీ చేసే ఐఎంఐ అభ్యర్థి, అక్బరుద్దీన్ ఒవైసీ మీద గట్టి పోటీ ఇచ్చేందుకు ఒక ముస్లిం యువతిని ఎంపిక చేసింది. ఆమె మామూలు ముస్లిం మహిళ కాదు. పచ్చి బిజెపి మనిషి.   జాతీయ భావాలు గల ముస్లిం యువతిని రంగంలోకి దించి చాంద్రాయణ గుట్ట మీద కమలం వికసింపి చేయాలని భావిస్తున్నది.  ఈ క్యాండిడేట్ పేరు  షహజాదే.  ఎబివిపి నాయకురాలు. గత కొన్ని సంవత్సరాలు బిజెపి అనుబంధ  విద్యార్థి సంఘం  ఎబివిపి  ఉస్మానియా యూనివర్సిటీ శాఖ లో కీలక పాత్ర వహిస్తున్నారు. సంఘ్, ఎబివిపి, పార్టీ పెద్దల ఆశీసులతో బీజేపీ లో చేరింది. అక్బర్ పై ఆమె పోటీకి సై అంటున్నది. ఏమవుతుందో చూడాలి. ఒక మహిళ బిజెపి తరఫున పాత బస్తీలో పోటీ చేయాలనుకోవడం ఇదే మొదటి సారి కావచ్చు. అందునా ఒవైసి కుటుంబ సభ్యుడి మీద.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *