తెలుగు సినిమా పాటలు- తెలుగు వోట్లు: తెలుగు నాడి పట్టిన ఒడిషా డాక్టర్

డాక్టర్ సంబిత్ పాత్రా తెలుగువాళ్ల నాడి పట్టేశారు. ఆంధ్రలో ఉంటే ఏముంది, తెలంగాణలో ఉంటే ఏముంది, ఒడిషాలోని పూరిలో ఉంటే ఏముంది, తెలుగువాళ్లంతా తెలుగు వాళ్లే, వాళ్లకు తెలుగు సినిమా పాటలంటే చెవికోసుకుంటారు.తెలుగు సినిమా పాట వింటే చిందులేస్తారు.

డాక్టర్ సంబిత్ పాత్ర ఎవరనుకుంటున్నారు, ఒరిస్సాలోని పూరి లోక్ సభనియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కూడా. చాలా వివాదాస్పదమయిన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో ఉంటారు. ఇపుడాయన పూరిలో ఎన్నికల ప్రచారం చేస్తూ సభల్లో తెలుగు పాటలు పడుతున్నారు.

తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళితే సభలో ఏదో ఒక తెలుగు పాట పాడతారు. అంతే, అక్కడున్న తెలుగు వాళ్లంతా ఈలలు, చప్పట్లు, కేరింతలు. సినిమా పాటకు తెలుగు హృదయం స్పందిస్తున్నది. రెండు రోజుల కిందట ఒక సభలో నాగార్జున హీరో గా నటించిన క్రిమినల్ చిత్రంలోని పాట అందుకున్నారు. అందుకోవడమేకాదు, రసవత్తరంగా పాడటంతో సభలో ఒక కోలాహలం. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో… అనే హిట్ సాంగ్ పాడారు. ఇది తెలుగులో నే కాదు, హిందీలో కూడా బాగా హిట్ అయింది.

సంబిత్ కూడా తన్మయత్వంతోనే పాడారు. తెలుగు వాళ్ల మనసుదోచుకున్నారు. ఈస్పందన ఆయన పులకించిపోయారు. వెంటనే తన పాటని ఆయన ట్విట్టర్ లో పెట్టారు. పూరిపట్టణంలో చాలా మంది తెలుగు వారున్నారు. ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నపుడు వాళ్ల కోరిక మీద ఫేమస్ తెలుగు పాటపాడాను. ప్రేక్షకుల్లో ఎంత కదలిక వచ్చిందో స్పష్టంగా కనిపించింది. నమ్మకంల లేదా? మీరు తప్పక చూడాలి. నా ప్రియమైన తెలుగు మిత్రులందరికి ప్రేమాభినందనలు, అని ట్వీట్ చేశారు. ఇది ఆయన పాడిన పాట ఆయన ట్వీట్ లోనే వినండి.

పూరి నియోజకవర్గంలో ఏప్రిల్ 23 న పోలింగ్ జరగుతుంది. నిన్న పోలింగ్ ముగిసింది. ఈ సభలో తెలుగు పాటే కాదు, దాని హిందీ వర్షన్ ‘తుమ్ మిలే దిల్ ఖిలే…’ కూడా పాడి ప్రేక్షకులను ఉర్రూత లూగించారు. అంతేకాదు,చిరంజీవి హీరో గా నటించిన ఘరానామొగుడు చిత్రం సూపర్ హిట్ పాటు ‘బంగారు కోడిపెట్ట’ కూడా పాడి కుర్రకారుకు పిచ్చెక్కించారు.
‘నేను బంగారు కోడిపెట్ట పాడుతుంటే, మీరు నమ్మలేరు, ప్రేక్షకుల మధ్య కుర్రకారు అదిరిపోయారు,’ అదిరిపోయారు అని రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *