అంబర్ పేట్ లో బిజేపి రాజాసింగ్ ను ఎలా అరెస్ట్ చేశారో (వీడియో)

తెలంగాణ ఏకైక బిజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అంబర్ పేట్ లో ఆదివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య వివాదం రేగింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అక్కడికి చేరుకోకుండా పోలీసులు మధ్యలో అడ్డగించి అరెస్టు చేశారు.
ఈ సమయంలో పోలీసులకు, రాజాసింగ్ కు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అయినప్పటికీ పోలీసులు ఆయనను వదిలిపెట్టకుండా అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. ఒక్క రాజాసింగ్ ను అరెస్టు చేసేందుకు వందల మంది పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆయనను ఎలా అరెస్టు చేశారో కింద వీడియోలో చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *