నాడు అసెంబ్లీలో పోర్న్ చూస్తూ పదవి పోయినా, ఇపుడు డిప్యూటీ సిఎం…

కర్నాటక బిజెపి ఎమ్మెల్యే లక్ష్మణ్ సంగప్పసవాడి పేరు ఎపుడైనా విన్నారా. ఆయన ఆ మధ్య జాతీయ వార్తల కెక్కారు. పెద్ద సెన్సేయన్ అయ్యారు. మంత్రి పదవి పోగొట్టుకున్నారు.
అపుడు కూడా ఆయన బెల్గావ్ జిల్లా అత్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కర్నాటక అసెంబ్లీకి గెలుపొందారు.
ఇంకా గుర్తురాలేదా? ఆయనే అసెంబ్లీలో మొబైల్ లో బ్లూ ఫిల్మ్ చూస్తూ పట్టుబడింది. ఆయనను ఇపుడు అదృష్టం వరించింది. ఆయన ఈరోజు కర్నాటక డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు.
ఈరోజు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించారు.
గత ఏడాది ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సవాడి ఓడిపోయారు. అయినా సరే యడ్యూరప్ప ఆయన ఉప ముఖ్యమంత్రిని చేశారు.
2012 అసెంబ్లీ సమావేశాలపుడు సభలో ఫోటోగ్రఫీని వీడియోలను నిషేధించారు. అయితే, కొంతమంది జర్నలిస్టులను మాత్రం ప్రేక్షకుల గ్యాలరీ నుంచి వీడియో తీసేందుకు అనుమతించారు.
అపుడు ఒక రోజు  సభ జోరుగా నడుస్తున్నపుడు లక్ష్మణ్ మొబైల్ లో  పోర్న్ వీడియో క్లిప్ చూస్తూఉండటం ఈ జర్నలిస్టుల కంటబడింది.
కర్నాటక అసెంబ్లీ లో సభ్యులు కూడా మొబైల్ ఫోన్లు వాడరాదు. అయినా సరే సవాడి ఫో న్ తెచ్చుకున్నారు.మొబైల్ ను పోర్న్ చూసేందుకు వాడుకున్నారు.
ఈ న్యూస్ వైరల్ అయిన తర్వాత సవాడి చెప్పిన సమాధానమేమిటో తెలుసా…
మేం పోర్న్ క్లిప్ ను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చూస్తున్నాం. ఎందుకంటే రేవ్ పార్టీలెలా సాగుతాయో తెలుసుకునేంవదుకు మాత్రమే పోర్న్ క్లిప్ చూసినట్లు ఆయన సమర్థించుకున్నారు.
ఆ తర్వాత సవాడితో పాటు సిసిపాటిల్, క్రిష్ణ పాలెమార్ అనే మంత్రులు కూడా పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.