Home English ఈ బెంగుళూరు విద్యార్థులను అభినందంచకుండా ఉండలేం, ఎందుకంటే

ఈ బెంగుళూరు విద్యార్థులను అభినందంచకుండా ఉండలేం, ఎందుకంటే

275
0
SHARE
ఏదో కారణం చేత కాలు తీసేయాల్సిరావడం మనల్ని క్రుంగదీస్తుంది. అదే  పిల్లలయితే, వాళ్లని ప్రపంచం నుంచి వేరుచేస్తుంది. ఆనందాన్ని కొల్ల గొడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని అధిగమించడం చాలా కష్టం. వాళ్లని మామూలు పిల్లల్లామార్చే మార్గం ఉందా! ఇది ఉన్నతయిన ఆలోచన. ఈ ఆలోచన పిల్లలకే వస్తే..మహోన్నతమయిన ఆలోచన అవుతుంది. వాళ్లని అభినందించాల్సిందే…
బెంగుళూరు దీన్స్ అకాడెమీ స్టూడెంట్స్ కు ఈ మహాత్తర ఆలోచన వచ్చింది గ్రామాల్లో కాల్లు పోయిన పిల్లలు మళ్లీ మామూలు పిల్లల్లాగా నడిచేందుకు సాయం చేద్దామనుకున్నారు. స్కూలు కూడా వీళ్ల వెన్నుతట్టి ప్రోత్సహించింది. నిధుల సేకరణకు పూనుకున్నారు.
దీని కోసం క్రౌడ్ ఫండింగ్ (crowdfunding) పద్ధతి ఎంచుకున్నారు. విజయవంతమయ్యారు. 17 రోజులలో రు.28.64 లక్షల సేకరించారు. క్రౌడ్ పండింగ్ అంటే ఏమిటో కాదు, ఎక్కువ మందినుంచి చిన్నచిన్న మొత్తాల్లో విరాళం సేకరించడం. దీనివల్ల ఎవరికీ బర్డెన్ ఉండదు.
ఈ డబ్బుతో వాళ్లు పిల్లలకు కృత్రిమ కాళ్లు కొనిపిస్తారు.
దీన్స్ అకాడెమీకి చెందిన 104 విద్యార్థులు క్రౌడ్ ఫండింగ్ లో ప్రవేశించారు. వీళ్లంతా 9నుంచి 12 వ తరగతి చదువుతన్న వాళ్లే. నిజానికి వాళ్లు సేకరించాలనుకున్నది కేవలం ఒక్కొక్కరు ఇద్దరికి కృత్రిమకాలు అమర్చేందుకు అవరసరమయిన రు.22వేలు మాత్రమే. అయితే అంతా లక్ష్యం మించి విరాళం సేకరించారు.
ఒక్కొక్కరికి కృత్రిమ కాలు అమర్చాలంటే అయ్యే ఖర్చు రు. 11 వేలు. ఇది పేద పిల్లలకు కాలు అమర్చేందుకు సబ్సి డితో ఫ్రీడమ్ థాట్ అనే ఎన్టీయే అందించే కృత్రిమ కాలు. ఇది కాలును పరీక్షించి, కొలతలు తీసుకుని, తయారుచేసి, అమర్చేందుకు అయ్యే మొత్తం ఖర్చు. సాధారణంగా దీనికి రు.30వేల నుంచి 40 వేల వరకు ఖర్చవుతాయి. అయితే,విద్యార్థుల చేపట్టిన గొప్ప కార్యక్రమం కాబట్టి దీనిని ఫ్రీడమ్ ధాట్ రు. 11 వేల సప్లయి చేసేందుకు ముందుకు వచ్చింది.
దీన్స్ అకాడెమీ విద్యార్థుల క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ జూన్ ఒకటిని మొదలయింది. అయితే, దీనికి మంచిస్పందన వస్తూండటంతో ఒక వారం పొడిగించారు. ఇపుడు ఈ నెల 21న క్యాంపెయిన్ ముగుస్తుంది.
సృజనాత్మక ప్రయోగాల కోసం, వితరణ, సేవ కార్యక్రమాలకు క్రౌడ్ ఫండింగ్ లో సహకరించే బెంగుళూరు ప్లాట్ ఫాం Fueladream వీళ్లకు సహకరించింది. ఈ ప్లాట్ ఫామ్ మొదట పేద పిల్లలకు సహకరించందేకు ముందుకు రావాలని దీన్స్ అకాడెమీ ని సంప్రదించారు. ఒక సామాజిక సమస్యను అర్థం చేసుకునేందుకు విద్యార్థులకు ఇది బాగా సహకరిస్తుందని భావించిన ఎకాడెమీ యాజమాన్యం దీనికి వెంటనే అంగీకరించింది.
కాలు లేని పిల్లలు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. వైకల్యం వల్ల వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వీలుంది. ఇతరులతో సమానంగా వాళ్లు జీవితంలో ముందుకు సాగలేరు. ఈ సమస్యనుంచి వాళ్లకి విముక్తి కల్గించాలన్న గొప్ప ఆశయం నాకు స్ఫూర్తినిచ్చిందని 11 వ తరగతి చదువుతున్న మెనెజా జిద్దిక్ చెప్పారు. ఆమె ఒక్కరే రు.1,29,951 సేకరించారని బిజినెస్ లైన్ రాసింది.
దీన్స్ అకాడెమీ ఈ కార్యక్రమానికి Back-on-their-feet అని నామకరణం చేశారు. వారితో ఫ్రీడమ్ ట్రస్టు చేతులు కలిపింది. ఈ ఎన్జీవో కాళ్లుపోయినా పిల్లలన గుర్తించి, వారి అవసరమయిన కృత్రిమ కాళ్లను తయారుచేయించి, వాటిని వాడటంలో శిక్షణ ఇచ్చే సంస్థ ఇది. ఇలాంటి పిల్లలను మళ్లీ రెండుకాళ్ల మీద నడిపించే కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నందుకు అకాడెమీ పిల్లలు గర్వపడుతున్నారు. (ఇమేజ్ సోర్స్ ఆల్ట్సో)
(ఈ స్టోరీ నచ్చితే షేర్ చేయండి. హెల్తీ జర్నలిజాన్ని ప్రోత్సహించండి. trendingtelugunews.com ను ఫాలో కండి)