Home English లక్షన్నర కోట్లు విరాళమిచ్చి రిటైరవుతున్నవిప్రో అజిమ్ ప్రేమ్జీ

లక్షన్నర కోట్లు విరాళమిచ్చి రిటైరవుతున్నవిప్రో అజిమ్ ప్రేమ్జీ

313
1
SHARE
విప్రో (Wipro) ని ప్రపంచ స్థాయి కంపెనీగా తీర్చిదిద్దిన అజిమ్ ప్రేమ్జీ కంపెనీ చెయిర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నారు.
నిన్న బెంగుళూరులోని కంపెనీ కార్యాలయంలో ఆయన చివరి జనరల్ బాడీ మీటింగ్ లో వీడ్కోలు  ప్రసంగం ఇచ్చారు.
అక్కడొక అసక్తి కరమయిన విషయం చెప్పి బాధ్యతలనుంచి తప్పుకుంటున్నారు.
ఆయన చెప్పింది మహాత్మగాంధీ ప్రవచనం. గాంధీ ప్రవచనాలు చెప్పడం బాగా తగ్గిపోయింది. కార్పొరేట్ ప్రపంచానికి మహాత్ముని బోధనలకు పొత్తు కుదరదు.అయితే, మహాత్ముని బోధనలనుంచే తాను స్ఫూర్తి పొందానని, ఆయన చెప్పిన మాటలను విశ్వసిస్తున్నానని ప్రేమ్జీ ప్రకటించారు.
సంపన్నులు తమ సంపదకు వోనర్లుగా కాకుండా సమాజం కోసం ట్రస్టీలుగా ఉండాలని ప్రేమ్జీ అన్నారు.
“My own thinking is of wealth and philanthropy is that we must remain ‘trustees’ of our wealth for society, not its owners,” అని ఆయన చెప్పారు. చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించారు.
తన సంపాదనను మొత్తం అజిమ్ ఫౌండేషన్ కు తిరిగి తీసుకునేందుకు వీల్లేకుండా ఫౌండేషన్ కు ఇచ్చారు. ఇంతవరకు ఆయన  ఫౌండేషన్ కు వచ్చిన మొత్తం రు. 1.5 లక్షల కోట్లు.ఇది కంపెనీ వొనర్షిప్ లో 67 శాతానికి సమానం.
ప్రపంచంలో ఇంత పెద్ద మొత్తాన్ని సంపాదించిన దాని మీద పూర్తిగా హక్కులు వదులుకున్న సంపన్నులు నలుగురైదుగురే ఉన్నారు. వాళ్లు బిల్ గేట్స్, జార్జి సోరోస్, వారెన్ బఫెట్ వగైరా. ఇపుడు ఈ జాబితాలోకి ప్రేమ్జీ చేరారు. ఆసియాలో ఇంత పెద్ద వితరణ శీలి మరొకరు లేరు.
ఆయన మొత్తం ఎంత విరాళమిచ్చారో తెలుసా?  కంపెనీలో ఉన్న తన భాగస్వామ్యం మొత్తం ట్రస్టుకు ఇచ్చారు. ఆయన పేరుమీదే ఉన ఈ ట్రస్టు బెంగుళూరులో ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తూ ఉంది. అయిదారు రాష్ట్రాలలో పేద పిల్లల విద్యకోసం, దివ్యాంగుల కోసం కార్యక్రమాలు చేపడుతూ ఉంది.
“As announced earlier, I have irrevocably renounced more of my personal assets and earmarked them to the endowment which supports the Azim Premji Foundation’s philanthropic activities. The total value of the philanthropic endowment corpus contributed over time is USD 21 billion, which includes 67% of economic ownership of Wipro Limited,” అని ఆయన పేర్కొన్నారు.
ఈ స్టోరీ మీకు నచ్చితే షేర్ చేయండి. trendingtelugunews.comను ఫాలో కండి
కంపెనీలో ప్రేమ్జీ కుటుంబానికి 74.30 శాతం వాటా ఉంది. ఇందులో 67 శాతాన్ని వారు ప్రేమ్జీ ఫౌండేషన్ రాసిచ్చారు. ఎలా బదలాయించారంటే, తిరిగితీసుకోవడానిక వీల్లేకుండా చేశారు.
భారతదేశంలో వితరణ అనేది పడిపోతున్న సమయంలో అజిమ్ ప్రేమ్జీ ఇలా ఉన్నదంతా వూడ్చి ఇచ్చేసి ప్రపంచాన్ని విస్మయ పరిచారు. ఇండియన్ ఫిలాంత్రఫీ రిపోర్డు ప్రకారం భారతదేశంలో ప్రతియేటా $500 మిలియన్ల కంటే ఎక్కువ అస్తులున్న వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. అయితే, వీరి దగ్గిర నుంచి పదికోట్లరుపాలయకంటే ఎక్కువ ఇలా సామాజిక కార్యక్రమాలకు అందించే వారి సంఖ్య 2014 నుంచి పడిపోతున్నదని ఈ రిపోర్టు తయారు చేసే బెయిన్ & కంపెనీ పేర్కొంది.
అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ కార్యక్రమాలు పదేళ్ల కిందట మొదలయ్యాయి. మారు మూలప్రాంతాలకు మెరుగైన విద్య అందించడం, ప్రభుత్వ పాఠశాలలో టీచర్లకు మంచి బోధనలో శిక్షణ ఇవ్వడంఫౌండేషన్ చేసేపనుల్లో ప్రధానమయినవి. అజిమ్ ప్రేమ్జీ ఆస్తుల మీద వచ్చే రాబడిని మొత్తంగా విద్యాసంబంధ కార్యక్రమాల మీదే ఖర్చుచేస్తారు. ఈనెల 30 అజిమ్ ప్రేమ్జీ రిటైరవుతున్నారు.
ప్రేమ్జీ తర్వాత కంపెనీ బాధ్యతలను ఆయన కుమారుడు రిషద్ ప్రేమ్జీ చేపడుతున్నారు.
విప్రో 1945లో ఒక చిన్న వంటనూనెలు తయారు చేసే అంగడితో మొదలయింది. ఇపుడు $ 25బిలియన్ ల గ్లోబల్ ఐటి కంపెనీ స్థాయికి ఎదిగింది. కంపెనీలో 1,75,000 మంది ఉద్యోగులున్నారు.