తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్… కారెక్కుతున్న మరో ఎమ్మెల్యే

తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కారెక్కెందుకు సిద్దమయ్యారు. బుధవారం ఉదయం ఆయన కేటిఆర్ తో సమావేశమయ్యారు. త్వరలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరుతానని ప్రకటించారు. నియోజక వర్గ అభివృద్ది కోసమే తాను పార్టీ మారుతున్నట్టు బీరం తెలిపారు.

ఇప్పటికే 5గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినట్టైతే ప్రతిపక్ష హోదా పోతుంది. టిఆర్ఎస్ కు నామినేటేడ్ ఎమ్మెల్యేతో కలుపుకొని 101 సభ్యులయ్యారు. మరో వైపు మరో ఐదుగురు ఎమ్మెల్యేలతోని కూడా చర్చలు జరుపుతున్నట్టు టిఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు కాంగ్రెస్ వికర్ష్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *