కెసిఆర్ ప్రభుత్వ లేఖ మీద ఆంధ్రలో వ్యతిరేకత

పోతిరెడ్డి పాడుహెడ్ రెగ్యులేటర్ నుంచి  ఆంధ్ర నీటిచౌర్యానికి పాల్పడుతూ ఉందని కృష్ణా బోర్డుకు కెసిఆర్ ప్రభుత్వం లేఖ రాయడాన్ని రాయలసీమ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి కెసిఆర్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రశంసించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ డెవెలప్ మెంట్ మీద ప్రముఖ విశ్లేషకుడు టి. లక్ష్మినారాయణ వ్యాఖ్య ఇది
కేసీఆర్: గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయరు ద్వారా రాయలసీమకు అందించి రతనాలసీమగా మార్చడానికి సహకరిస్తా!
జగన్: కేసీఆర్ గారు చాలా ఔధార్యం ఉన్న మంచి వ్యక్తి
తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి తీసుకెళుతున్న నీటిపై దొంగ లెక్కలు చెబుతున్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు చర్యలు తీసుకోవాలి.
నా వ్యాఖ్య: పది సంవత్సరాల తదనంతరం కృష్ణా నదికి వరదలొచ్చి, ఏడెనిమిది లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో వృధాగా కలిసి పోతున్నది. మరొక వైపు రాయలసీమ ప్రాంతం వర్షాలు పడక కరవుతో విలవిల్లాడుతున్నది. శ్రీశైలం జలాశయం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తరలిస్తుంటే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడాన్ని ఏమనాలి? రాయలసీమను రతనాలసీమ చేయడమంటే ఇదేనా ! కేసీఆర్ గారు?
– టి.లక్ష్మీనారాయణ

 

ఇది కూాడా చదవండి

https://trendingtelugunews.com/an-appeal-from-rayalaseema-to-chief-minister-jagan-and-opposition-leader-chandrababu-naidu/