విద్యార్థులకు, గృహిణులకు అమెజాన్ శుభవార్త…

విద్యార్థులను, గృహిణులను టార్గెట్ చేసుకుని పార్సిల్ డెలివరీని విస్తృత పరిచేందుకు అమెజాన్ ‘అమెజాన్ ఫ్లెక్స్ ’ ప్రారంభిస్తున్నది.

సొంత టూవీలర్ ఉన్న విద్యార్థులు, గృహిణులు తమకు అనుకూలమయిన టైంలో అమెజాన్ యాప్ ఉపయోగించి సరుకులను వినియోగదారులకు డెలివరీ చేయవచ్చు.

గంటకు రు. 120 నుంచి రు.140 దాక లభిస్తుంది. అమెజాన్ ఫ్లెక్స్ లో చేరిన వాళ్లకు ఆన్ లైన్ ద్వార ప్రతి బుధవారం పేమెంట్ చెల్లిస్తారు.

ఈ ఫ్రీలాన్స్ డెలివరీ పార్ట్ నర్స్ నేపథ్యం వెరిఫై చేశాక అమెజాన్ ఫ్లెక్స్ లోకి తీసుకుంటారు. అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాత యాప్ వినియోగం మీద, సురక్షితంగా డ్ర్రవ్ చేయడం మీద, కస్టమర్ ఎక్స్ పీరియన్స్ మీద శిక్షణ ఇస్తారు.

అమెజాన్ ఫ్లెక్స్ లో చేరిన ఫ్రీలాన్స్ పార్ట్ నర్స్ కి రు.5లక్షల దాకా యాక్సిడెంట్, అంగవైకల్యం గ్రూప్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఇపుడీ సర్వీస్ బెంగుళూరు, ఢిల్లీలో, ముంబాయ్ లలో అందుబాటులో ఉందని, ఈ ఏడాది చివర్లో ఇతర నగరాలకు విస్తరించవచ్చని Inc42.com పేర్కొంది.

అమెజాన్ ప్లెక్స్ ను ఇప్పటికే యుఎస్, స్పెయిన్, జపాన్, సింగపూర్, జర్మనీ, ఇంగ్లండులలో ప్రవేశపెట్టారు. ప్రీలాన్స్ పార్ట్నర్స్ తమ అనుకూలమయిన టైంలో నాలుగు గంటల దాకా పనిచేసేందుకు అనుమతిస్తారు. వారంలో 25 నుంచి 30 గంటలదాకా పనిచేసే అవకాశం ఉంటుంది. అంటేఅటుఇటుగా మూడు నుంచి నాలుగు వేల దాకా ఆర్జించవచ్చు.

ఓపిక పట్టండి… తొందర్లో అమెజాన్ ఫ్లెక్స్ హైదరాబాద్ కు రాబోతున్నది…

(ఇది నచ్చితే నలుగురి తెలిసేలా షేర్ చేయండి, trendingtelugunews.comను ఫాలో కండి)