పాక్ ఆర్మీకి గూబ గుయ్యమనే జవాబిచ్చిన అభినందన్ (లేటెస్ట్ వీడియో)

వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ యావత్ భారతదేశంలో క్రేజీ హీరో అయిపోయాడు. ఫిబ్రవరి 27 న భారత్ సరిహద్దులు దాటి దాడికి యత్నించిన పాక్ యుద్ధ విమానాలను తరిమికొట్టే ప్రయత్నంలో మన మిగ్ 21 పైలట్ అనుకోకుండా పాక్ సైనికులకు చిక్కాడు. వారి చెరలో ఉన్నప్పటికీ ధైర్యం కోల్పోకుండా ఆయన ప్రదర్శించిన గుండె ధైర్యానికి ఇండియన్స్ అందరూ ఆయనకి అభిమానులైపోయారు.

పాక్ సైన్యం విడుదల చేసిన వీడియోలలో అభినందన్ ను చూసి భారత సింహం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే అభినందన్ గుండె ధైర్యాన్ని ప్రతిబింబించే మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పాక్ ఆర్మీ అడిగిన ఒక ప్రశ్నకు అభినందన్ గూబ గుయ్యమనేలా సమాధానమిచ్చారంటూ నెటిజన్లు ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. వీడియో కింద ఉంది చూడవచ్చు. ఈ వీడియోలో పాక్ సైనికులు అడిగిన ప్రశ్నకు అభినందన్ ఏ విధంగా సమాధానమిచ్చారో చూడండి.

పాక్ సైనికుడు: సో వింగ్ కమాండర్ అభి?
అభినందన్ : ఎస్ సర్. (ఏమాత్రం భయం లేకుండా అదే గంభీర స్వరంతో)

పాక్ సైనికుడు: పాక్ ఆర్మీ గురించి మీ అభిప్రాయం ఏంటి?
అభినందన్: పాక్ ఆర్మీ అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది. పాక్ ఆర్మీలో కూడా సైనికులు ఉన్నారు. అందుకే మొదట మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడిగాను కదా, మీరు రెగ్యులర్ ఆర్మీకి చెందినవారేన అని.

ఆయన సమాధానంలో ఉద్దేశం ఏమిటంటే పాక్ ఆర్మీలో ఉగ్రవాదులు కూడా ఉన్నారని. ఆయన చెప్పిన ఈ సమాధానం పాక్ ఆర్మీ గూబ గుయ్యమనేలా ఉందని అభి అభిమానులు అంటున్నారు. శత్రుదేశంలో ఉండి ఈ సమాధానం చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి? ఈ ధైర్యం చూసే కదా మీ అభిమానులయ్యాము అంటున్నారు.

https://www.youtube.com/watch?time_continue=3&v=HDUKFQjftwI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *