తెలంగాణలో 3 నగరాలు ఎయిర్ పోర్ట్ లకు అనుకూలం

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టుల మీద టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి అందాయి.

మొత్తం ఆరు విమానాశ్రయాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో మూడు మాత్రమే పూర్తిస్థాయి ఎయిర్ పోర్టుల నిర్మాణం, పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలమని నివేదిక తెలిపింది.

వరంగల్లోని మామూనూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లోని జక్రాన్ పల్లిలు మాత్రమే పూర్తిస్థాయి విమానాశ్రయాలకు అనుకూలంగా ఉన్నాయని నివేదించాయి.

భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్ నగర్ లోని దేవరకద్ర, పెద్దపల్లిలోని బసంత్ నగర్లు ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు, పెద్ద విమాన రాకపోకలకు అంతగా అనుకూలంగా లేవని ఈ రిపోర్టు తయారు చేసిన  ఎయిర్ పోర్టుల అథారిటీ (AAI) తేల్చింది.
ప్రస్తుతం  లో తెలంగాణలో రెండు ఎయిర్ పోర్టుల మాత్రమే ఉన్నాయి. ఇందులో బేగంపేట రెగ్యులర్ వాడకంలో లేదు. పనిచేస్తున్నది శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్లేషనల్ ఎయిర్ పోర్ట్ మాత్రమే.

కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి సంబంధించి సైట్ అనుమతి కోరుతూ రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదని కేంద్ర పౌరవిమానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా , కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా గత నెలలో చెప్పారు.

“Proposal for site clearance for the proposed greenfield airports from the state government has not been received in the Ministry of Civil Aviation: Jyotiraditya Scindia

తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది.

మొత్తం ఆరింటిలో 3 మాత్రమే అన్ని రకాల తగిన విధంగా ఉన్నాయని ఎయిర్ పోర్టు అథారిటీ తన నివేదికలో పేర్కొంది. వివిధ దఫాల్లో క్షేత్రస్థాయి సందర్శన చేసిన కేంద్ర బృందాలు నివేదిక తయారు చేశారు.జూలై 7 వ  తేదీనే కేంద్రం నుంచి ఈ రిపోర్టుల రాష్ట్రానికి అందాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *